జనవిజయంఆరోగ్యంతెలంగాణ వైద్యారోగ్య రంగం బలోపేతం

తెలంగాణ వైద్యారోగ్య రంగం బలోపేతం

  • డయోగ్నస్టిక్ సెంటర్లతో పరీక్షలన్నీ ఉచితం
  • ప్రైవేట్ సెంటర్లకు డబ్బలు తగలేయాల్సిన ఆగత్యం ఉండదు

హైదరాబాద్, జూన్ 10(జనవిజయం): తెలంగాణలో ఆరోగ్యరంగం బలోపేతం చేసే దిశగా సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలు పేదలకు వరం కానున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ దవాఖానాలు నిధులు లేక, సిబ్బంది లేక నీరసించి పోతున్నాయి. కరోనాతో లోపాలు బయటపడ్డాయి. ఈ దశలో ఆస్పత్రుల్లో పెద్ద ఎత్తున డయగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. ఈ రకంగా మెల్లగా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా ఎమ్మెల్యేలు, ఎంపిలు కూడా తమవంతుగా కృషి చేయాలి. నిజానికి ప్రాథమిక స్థాయిలో ఆస్పత్రులు బలోపేతం అయితే.. చీటికిమాటికీ ప్రైవేట్ ఆస్పత్రలు జోలికి వెళ్లాల్సిన ఆగత్యం ఉండదు. అలాగే ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు వందలకోట్లు తగలెయ్యడం కన్నా ఇలా అఅభివృద్ధి చేయడం మంచిదే. దీంతో ప్రభుత్వపై ఈ రకంగా భారం తప్పి ప్రజల్లో కూడా మంచి పేరు వస్తుంది. ఈ క్రమంలో కనీసం జిల్లా స్థాయి ఆస్పత్రులను అన్ని విధాలుగా బలోపేతం చేసుకునేందుకు మంత్రులు కూడా నడుం బిగించి సిఎం కెసిఆర్ చేస్తున్న మంచిపనికి అండగా నిలవాలి. ఎంపిలు తమ ఎంపిల్యాడ్ నిధులతో ఆస్పత్రులను బలోపేతం చేసేందుకు అనవరమైన సామాగ్రి కొనుగోలుకు ముందుకు రావాలి.

ఇకపోతే గతంలోనే సిఎం కెసిఆర్ హెల్త్ ప్రొఫైల్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆస్పత్రులను బలోపేతం చేస్తే ఈ సమస్య కూడా తీరగలదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలతో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇప్పటికే సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇందుకోసం జిల్లా ఆసుపత్రుల్లో కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్లను మంత్రులు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన రోగ నిర్ధారణ సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ కేంద్రాల్లో 57 రకాల రక్త పరీక్షలను ఉచితంగా చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించి వెంటనే సంబంధిత కేంద్రాలకు పంపిస్తారు. ఇప్పటి వరకు కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ పెద్దాసుపత్రులకే మాత్రమే పరిమితమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ పరీక్షలే కాకుండా ఖర్చుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా అందిస్తారు.

శాంపిల్స్ సేకరించిన రోజే సాయంత్రానికల్లా టెస్టు రిజల్ట్ నేరుగా సంబంధిత వ్యక్తి మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతారు. మొత్తంగా ఇప్పుడు పౌరుల ఆరోగ్య వివరాలను నమోదు చేసే ‘హెల్త్ ప్రొఫైల్ ను ప్రభుత్వం మళ్లీ ప్రారంభించబోతోందన్న సంకేతాలు వస్తున్నాయి. 2019 ఆగస్టు 2న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. హెల్త్ ప్రొఫైల్ అనేది ప్రస్తుతం ఇంగ్లండ్, అమెరికా దేశాల్లోనే ఉంది. అక్కడి పౌరులకు ఆ దేశ ప్రభుత్వాలు విధిగా దీనిని నిర్వహిస్తాయి. వీటి ద్వారానే వైద్య సేవలకు ఎటువంటి ప్రాధాన్యమివ్వాలి, ఎలా ప్రణాళికలు రూపొందించుకోవాలనే విషయంపై నిర్ణయాలు తీసుకుంటాయి. వివిధ ప్రాంతాల మధ్య ఆరోగ్య సూచీల్లో తేడాలు కూడా దీని ద్వారానే తెలుస్తాయి. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో ఉండే జబ్బులు, వ్యాధులు దక్షిణ తెలంగాణలో తక్కువగా ఉంటాయి. అలాగే ఏజెన్సీలో ఉండే వాటికి, ఇతర ప్రాంతాల్లో ఉండే వాటికి మధ్య కూడా వ్యత్యాసం ఉంటుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో ఉండేవారి ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం ద్వారా తదనుగుణంగా మందులు, వైద్య సేవలు అందించవచ్చని, స్పెషలిస్టు వైద్యుల నియమాకాలు చేపట్టవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం.

ప్రతి వ్యక్తి ఎత్తు, బరువుతోపాటు లివర్, గుండె, మూత్రపిండాల పనితీరు, షుగర్ లెవల్స్, ఆహారపు అలవాట్లు, పొగతాగే అలవాట్లు వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో బ్లడ్ గ్రూపింగ్, నీబీపీ, ఆర్‌బీఎన్, పాప్ స్మియర్, మామోగ్రపీతో పాటు మరికొన్ని రకాల టెస్టులుంటాయి. ఇటువంటి వైద్య పరీక్షలు గ్రామంలోని ప్రతి ఒక్కరికి నిర్వహించడం ద్వారా హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తారు. ఇటువంటి వాటితోపాటు కేన్సర్ లాంటి మహమ్మారులు కూడా బయటపడతాయి. తద్వారా వ్యాధులకు చికిత్సలు చేయడం సులువు కానుంది. ప్రజలు ఏయే రకాల జబ్బులతో బాధపడుతున్నారన్నది తెలుసుకుని వైద్యం అందించడం కూడా సులువు కానుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి