జనవిజయంతెలంగాణతెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ యుద్ధం!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ యుద్ధం!

  • బిజెపి తీరుకు ఘాటుగా సమాధానమిస్తున్న టీఆర్ఎస్
  • ధాన్యం సేకరణకు అడ్డంకిగా మారిన పరిస్థితులు
  • అకాల వర్షాలకు అనేక చోట్ల రతన్నల కన్నీరు

హైదరాబాద్,మే25(జనవిజయం): తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికార టీఆర్ఎన్, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ధాన్యం కొనుగోళ్లపై బిజెపి ఒకరోజు దీక్ష చేపట్టగా, దానికి దీటుగా ధాన్యం కొనుగోళ్లపై పల్లా రాజేశ్వర రెడ్డి సమాధానం ఇచ్చారు. అక్కడక్కడా రైతుల ఆందోళనలు ఉన్నాయి. కానీ రైతు సమన్వయ సమితులు గ్రామస్థాయిలో తమ లక్ష్యాన్ని నెరవేర్చడం లేదన్నది నిజం. వారు రైతులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగితే ఇంతగా పరిస్థితులు ఉండేవి కావు. అలాగే కరోనా సందర్భాన్ని కూడా విస్మరించరాదు. ఈ కష్టకాలంలో రైతులు కూడా పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. దీనికితోడు గ్రామస్థాయిలో సమన్వయ సమితులు సమాచారం సేకరించి ధాన్యం కొనుగోళ్లలో సహకరించాల్సిన బాధ్యతను తీసుకోవాలి. ఇటీవలి అకాల వర్షాల కారణంగా అనేకచోట్ల ధాన్యం తడిని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏమాత్రం ఊహకందని రీతిలో పలు జిల్లాల్లో ఏకధాటిగా వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో పొలాలు, కల్లాలు, రోడ్లు, వైరా ఏఎంసీలో ఆరబోసిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. దాదాపు 20రోజుల క్రితం కాంటాలు వేసి మిల్లుల కేటాయింపు లేక లారీల కొరతతో లాట్లుగా ఉన్న ధాన్యం బస్తాల అడుగుభాగంలో వర్షపునీరు చేరి తడిసిపోయాయి. దాదాపు పది కిలోమీటర్ల పొడవు రోడ్లపైన వేలాది క్వింటాళ్ల ధాన్యం బస్తాలు లాట్లుగా వేసుకొని రైతులు ఎగుమతుల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. తమకున్న వనరుల మేరకు ధాన్యం బస్తాలను కాపాడుకొనేందుకు రైతులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ భారీవర్షం కారణంగా వరదనీరు రోడ్లు, పొలాలపై అడుగు లోతులో ప్రవహించాయి. ఎక్కడ చూసినా, నీళ్లమయం అయింది. ఈ నీరు మొత్తం ధాన్యం బస్తాల అడుగు భాగంలో చేరింది. అడుగుభాగంలోని ధాన్యం బస్తాలన్నీ నల్లరంగుకు వచ్చి వడ్లన్నీ మొలకెత్తిపోయాయి. పలుచోట్ల రాశుల్లోని ధాన్యం కూడా తడిని మొలకలు వచ్చాయి. మార్కెట్లలో కూడా క్వింటాళ్ల ధాన్యం కూడా తడిసిపోయింది. రాశులుగా ఉన్న ధాన్యాన్నికూడా కాంటా వేసి తరలించాలని రైతులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లను పదిరోజుల్లో ముగించాలని కేసీఆర్ చేస్తున్న ప్రకటన ప్రకారం అధికారులు తమను కాపాడాలని కోరుతున్నారు.

అనేక జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర దాటుతున్నా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. గన్నీనంచుల కొరత, హమాలీల కొరత, లారీల కొరత వంటి సాకులు చూపుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ధాన్యం తరలింపులో జాప్యం చేస్తున్నారు. రైతులు అధికారులను ఇదేమని అడిగితే మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో అంటూ ఎదురు సమాధానం ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో ఎక్కడికక్కడే ధాన్యంరాశులు పేరుకుపోయి ఉన్నాయి. రైతులు సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అంతేకాకుండా తాలు, కడ్తా పేరుతో క్వింటాలుకు ఆరు నుంచి ఎనిమిది కిలోలు మోసం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు సత్వరమే పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి