జనవిజయంఆరోగ్యంఉచిత వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలకై తెలంగాణా డయాగ్నస్టిక్ హబ్ కేంద్రాలు - మంత్రి పువ్వాడ...

ఉచిత వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షలకై తెలంగాణా డయాగ్నస్టిక్ హబ్ కేంద్రాలు – మంత్రి పువ్వాడ అజెయ్ కుమార్

ఖమ్మం,జూన్9(జనవిజయం): ప్రజలందరికి ఉచితంగా వ్యాధి నిర్ధారణ వైద్య పరీక్షల సేవలకు గాను తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ ను ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణతో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు నేడు ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ లను ప్రారంభించుకున్నట్లు మంత్రి తెలిపారు. పేదప్రజలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఆర్ధిక భారంగా మారిందని, ప్రజలందరికి ఉచితంగా వ్యాధి నిర్ధారణ సేవలందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సుమారు 2.25 కోట్లతో వ్యాధి నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేసి డయాగ్నిస్టిక్ హబ్ ను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రక్త నమూనాలను సేకరించి 57 రకాల వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతాయని, వ్యాధి నిర్ధారణ అనంతరం పేషెంట్ సెల్ ఫోన్ తో పాటు సంబంధిత వైద్యశాలకు టెస్ట్ రిపోర్టులు పంపబడతాయని మంత్రి తెలిపారు. 57 రకాల వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు క్యాన్సర్, గుండెజబ్బుల వ్యాధి నిర్ధారణ పరికరాలను కూడా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగిందని మంత్రి అన్నారు.

మధిర, సత్తుపల్లి వైద్యశాలలను 100 పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా మరో 8 పందల పడకల ఆసుపత్రి కానుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైద్య రంగంలో వెయ్యి పడకల సదుపాయం ప్రజలకు అందుబాటులోకి రానున్నదని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఇప్పటికే 550 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసుకున్నామని, ప్రత్యేకంగా మాతా-శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగాయని మంత్రి అన్నారు. అదేవిధంగా కోవిడ్ విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఆక్సిజన్ బెడ్స్, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని మంత్రి తెలిపారు.

పేద ప్రజలకు ప్రభుత్వ రంగ వైద్య సేవలను అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలనందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నదని, సామాన్యుడికి ప్రభుత్వ రంగ వైద్యాన్ని మరింతగా అందుబాటులోకి తేవడం ద్వారా ఆరోగ్య తెలంగాణ దిశగా మరో మందడుగువేసిందన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి మనిషికి బి.పి, షుగరు వంటి జబ్బులు అధికమయ్యాయని దీనితోపాటు ఇతర జబ్బులకు సంబంధించిన రోగ నిర్ధారణ పరీక్షలు నిత్యం పేదలకు అవసరంగా మరీన నేపథ్యంలో సామాన్య ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులలో రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే ఆర్ధిక స్తోమత లేనటువంటి వారు వారు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో వైద్య సేవలతో పాటు ఉచిత రోగ నిర్ధారణ సేవలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం తెలంగాణ డయాగ్నిస్టిక్ హబ్ మ్ ఏర్పాటును నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చికిత్స పొందే రోగులు స్వయంగా డయాగ్నిస్టిక్ కేంద్రాలకు వెళ్ళలేని పరిస్థితులలో సంబంధిత వైద్యుని సిఫార్సు మేరకు రోగ నిర్ధారణ పరీక్షల నమూనాలను సమీపంలోని కేంద్రానికి పంపి పరీక్షలు నిర్వహించి సత్వరమే రిపోర్టు అందించేందుకు గాను ప్రభుత్వ వాహనాలను కూడా సమకూర్చిందని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాలో నమూనా సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

నగర మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములునాయక్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, స్థానిక కార్పోరేటర్ క్లయిమెట్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మాలతీ, ఆర్.యం.ఓ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ సైదులు, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి