జనవిజయంజాతీయంఒడిషా బాలసోర్ వద్ద తీరం దాటిన యాన్ తుఫాన్

ఒడిషా బాలసోర్ వద్ద తీరం దాటిన యాన్ తుఫాన్

  • రీగా ఈదురు గాలులతో పెను విధ్వంసం
  • 11లక్షల మంద సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • ఒడిషా ధర్మ గ్రామం పూర్తిగా ధ్వంసం

భువనేశ్వర్,మే26(జనవిజయం): బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్ యాన్ మరింత ఉగ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుఫాన్ గా మారి బాలసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు హైఅలర్ట్ ప్రకటించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. తుఫాన్ నహాయక చర్యల కోసం ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాల్లో దాదాపు 52 ఎన్టీఆర్ఎఫ్ టీమ్స్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాన్ తుపాను ఒడిషాలో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ఎఫెక్ట్ కి పౌర్ణమి పోటు తోడవటంతో ఊరికి, సముద్రానికి మధ్యన ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. నిన్నటి వరకు సముద్ర తీరంలో ఉన్న ఊరు కాస్త ఈరోజు సముద్రంలో భాగమైంది. ఒడిషాలోని భద్రక్ జిల్లాలోని ధర్మ గ్రామంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. అతి తీవ్ర తుపానుగా మారిన యాన్ ఒడిషా, బెంగాల్ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తోంది. తుపాను తీరం దాటే ముందు పెను గాలులు, భారీ వర్షాలు సహజమే. కానీ ఈసారి తుపాను తీరం దాటే సమయంలో పౌర్ణమి కూడా రావడంతో సముద్రం పోటు అసాధరణంగా ఉంది. బంగళాఖాతంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు పది మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. ఇక భద్రక్ జిల్లాలో ధర్మా గ్రామ సమీపంలో అయితే సముద్రం మరింతగా ఉ ప్పొంగింది. సునామి తరహాలో గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఈ గ్రామాన్ని తనలో కలిపేసుకుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి