Tuesday, October 3, 2023
Homeవార్తలుతీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా?!

తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారా?!

హైదరాబాద్ , జులై19(జనవిజయం):

బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తీగల తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితా రెడ్డితో కలిసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోబోతున్నారనేది విశ్వసనీయ సమాచారం. తీగల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు.

తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తీగల కృష్ణారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ మేయర్‌గా, హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా) ఛైర్మన్‌గానూ పనిచేశారు. 2019లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డిపై టీడీపీ తరపున పోటీ చేసిన గెలిచిన తీగల కృష్ణారెడ్డి ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో తీగల ఓడిపోయారు.

తరువాత పరిణామాలలో సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. సబిత, తీగల మధ్య తరచూ ఆధిపత్య పోరు నెలకొంటోంది. బీఆర్ఎస్ నుంచి తనకు టికెట్ రాదనీ, పార్టీలో ఇతరత్రా కూడా తనకు ప్రాధాన్యత తగ్గుతూ వస్తోందని తీగల మదనపడుతున్నారు. సిట్టింగ్‌లకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశముందని సంకేతాలు పార్టీ నుంచి రావడంతో ఇక పార్టీలో ఉండటం కూడా లాభం లేదనే నిర్ణయానికి వచ్చిన తీగల పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తీగల చేరికకు కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.తీగల కాంగ్రెస్ పార్టీలో చేరితే మహేశ్వరంలో వార్ తీవ్రంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments