Thursday, October 5, 2023
Homeవార్తలుసమస్యల పరిష్కారం కోరుతూ USPC ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ-ధర్నా

సమస్యల పరిష్కారం కోరుతూ USPC ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ-ధర్నా

ఖమ్మం, ఆగష్టు 12 (జనవిజయం): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ను అమలు చేయాలని, రాష్ట్రంలో వేతన సవరణ సంఘాన్ని సత్వరo నియమించి 2023 జూలై 1 నుంచి ఇంటీరియo రిలీఫ్ ప్రకటించాలని, జాతీయ విద్యా విధానం 2020ని రాష్ట్రంలో తిరస్కరించాలని, ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రతినెల మొదటి తేదీన వేతనాలు చెల్లించడంతోపాటు పెండింగ్లో ఉన్న బకాయిలన్నింటినీ చెల్లించాలని, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఆదాయప్పన్ను చెల్లింపు పరిమితిని ఎనిమిది లక్షలకు పెంచాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి పాత కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు ధర్నా చేశారు. USPC రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవరకొండ సైదులు ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా USPC రాష్ట్ర నాయకులు సైదులు, దుర్గ భవాని మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటం, విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం, బదిలీలు ప్రమోషన్లు చేపట్ట లేకపోవడం, ఆదాయప్పను పరిమితిని పెంచకుండా ఇస్తున్న వేతనాల నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం పన్ను రూపంలో తిరిగి మినహాయింపు చేసుకోవటం, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగిస్తూ, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఉద్యోగులకు నష్టం చేయడం, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు, భార్యాభర్తలకు న్యాయం చేయకపోవడం, ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక స్వభావానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో సిపిఎస్ ను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా వక్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీలు ఇవ్వడం కాదని, అమలు చేయాలని ఈ సందర్భంగా బండి నరసింహారావు డిమాండ్ చేశారు.

USPC జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు జీ.వీ. నాగమల్లేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు, జీ.యాదగిరి, హసేన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ ధర్నా శిబిరానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరావు, గోకినపల్లి వెంకటేశ్వరరావు (CPIML) బుగ్గవీటి సరళ (CPM) శివరామకృష్ణ (సీపీఐ) హాజరై మద్దతు ప్రకటించారు. ధర్నా శిబిరానికి USPC జిల్లా నాయకులు పారుపల్లి నాగేశ్వరరావు, ఎస్.విజయ్, మన్సూర్, రామకృష్ణ, బుర్రివెంకన్న, షమీ, సంధ్య, వల్లంకొండ రాంబాబు, రంజాన్, వెంగళరావు, ప్రసాద్, గీత, నిర్మల కుమారి తదితరులు నాయకత్వం వహించారు.

ఉపాధ్యాయుల భారీ ర్యాలీ

USPC పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్డు మీదుగా పాత కలెక్టరేట్, జిల్లా పరిషత్ వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్ద పెట్టున నినదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments