Wednesday, November 29, 2023
Homeవార్తలుభద్రాచలం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు బహిరంగ లేఖ

భద్రాచలం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు బహిరంగ లేఖ

100 కోట్లతో రామాలయ అభివృద్ధి ఇంతవరకు ప్రారంభం కాలేదు!

 

భద్రాచలం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు  బహిరంగ లేఖ

భద్రాచలం, 29 సెప్టెంబర్ (జనవిజయం)

1. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 10 సం॥లు అవుతున్నది 2016 లో భద్రాచలం వచ్చిన గౌ . ముఖ్యమంత్రి శ్రీ కె.సి. ఆర్ . గారు భద్రాచలం రామాలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించి రామాలయం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు 100 కోట్లతో రామాలయ అభివృద్ధి ఇంతవరకు ప్రారంభం కాలేదు .

2. 2022 వరదల సమయంలో శ్రీ కె.సి. ఆర్ . గారు భద్రాచలం వచ్చి ప్రతి యేట వచ్చే గోదావరి వరదల నుంచి భద్రాచల పట్టణాన్ని మరియు పంట పొలాలు , కాలనీలు ముంపుకు గురి కాకుండ కరకట్ట నిర్మాణానికి 1000 కోట్లు నిధులు మంజూరు చేస్తానన్న హామీ ఇంత వరకు నెరవేరలేదు . తక్షణమే నిధులు మంజూరు చేసి కరకట్ట నిర్మాణాన్ని తెలంగాణ బార్డర్ కూనవరం రోడ్ ) వరకు నిర్మాణం చేపట్టి శాశ్వతంగా భద్రాచల పట్టణాన్ని ముంపుకు గురికాకుండా చూడాలి . 3. ప్రతి సం || భద్రాచల రామాలయంలో జరిగే ఉత్సవాలు

ముక్కోటి ఏకాదశి మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు అయ్యే ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఉత్సవాలు ప్రభుత్వంమే నిర్వహించాలి . 4. ఆంధ్రాలో ఉన్న 5 పంచాయితీలు తెలంగాణలో కలిపేందుకు మీ మిత్రుడు జగన్మోహన్రెడ్డితో మాట్లాడి 5 పంచాయితీలు తెలంగాణలో కలిపేందుకు చర్యలు తీసుకోవాలి .

5. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 24 గం || ఉచిత కరెంటు ఇస్తూ , భద్రాచలం మండల రైతులకు 24 గం || ల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు . వెంటనే భద్రాచలం రైతులకు 24 గం ॥ ఉచిత కరెంటు ఇవ్వాలి . గౌ ॥ కె.టి.ఆర్ . గారు మీరు మొట్టమొదటి సారిగా భద్రాచలం వస్తున్నారు కాబట్టి ముందుగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని మీ నాన్నగారు ఇచ్చిన హామీలకు తక్షణమే నిధులు మంజూరు చేసి , రాముని సన్నిధిలో ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ ఈ బహిరంగలేఖ ద్వారా డిమాండ్ చేస్తుంది .

ఈ లేఖ   తెలుగు దేశం పార్టి ఆధ్వర్యంలో కొడాలిశ్రీనివాసన్,నూతలపటి,దాసయ్య, ఎస్.కె.అజీమ్,,కంభంపాటి,సురేషకుమార్,కుంచాల,రాజారామ్,అబ్బినేని,శ్రీనివాస్,తాళ్లూరి చిట్టిబాబు కోనేరు రాము ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments