జనవిజయంతెలంగాణతక్షణమే సమ్మె విరమించకుంటే చర్యలు - జూ.డాలకు కే.టీ.ఆర్ హెచ్చరిక

తక్షణమే సమ్మె విరమించకుంటే చర్యలు – జూ.డాలకు కే.టీ.ఆర్ హెచ్చరిక

  • డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగిన జూడాలు
  • అత్యవసర సేవలకే పరిమితం అయిన డాక్టర్లు
  • సమస్యలు పరిష్కరించకుంటే 28నుంచి మరింత ఉధృతం
  • జూడాల సమ్మెను తప్పుపట్టిన మంత్రి కెటిఆర్
  • క్షణం విరమించాలని ఆదేశం.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్,మే26(జనవిజయం): గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీని అమలుచేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు బుధవారం నుంచి ఆందోళన బాట పట్టారు. ఎమర్జెన్సీ, కరోనా ఐసీయూ వార్డులు మినహా మిగతా డ్యూటీలు బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు. డిమాండ్లు తీర్చకపోతే శుక్రవారం నుంచి మొత్తం సేవలు బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ నెల పదో తేదీనే జూడాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. గతంలో ఇచ్చిన జీతాల పెంపు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ రెసిడెంట్స్, జూనియర్ రెసిడెంటకు 15 శాతం జీతాలు పెంచాలంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో చెప్పినట్లుగా 10 శాతం ఇన్సెటివ్స్ వెంటనే చెల్లించాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కరోనా బారిన పడిన జూడాలు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్ లో ఐసోలేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. జూడాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదని డీఎంఈ రమేశ్ రెడ్డి చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎంలో జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. అత్యవసర సేవలు మినహా ఇతర విధులను బహిష్కరిం చాలని జూదాలు నిర్ణయించారు. పెంచిన స్టెఫండ్, కొవిడ్ ప్రోత్సాహకాలు వెంటనే అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆసుపత్రుల్లో 28 నుంచి అన్ని విధులు హిష్కరించాలని జూదాలు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిం చారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదు.. వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. పెంచిన స్టెఫండ్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే – ఆంద్రం కలగజేసుకోకపోవడం వల్లే టీకాల కొరత ఏర్పడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ టీకా హబ్ అయినా గ్లోబల్ టెండర్లు పిలవాల్సి వచ్చిందన్నారు. కోటి వ్యాక్సిన్లకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి