జనవిజయంసినిమాతాతకు తగ్గ మనువడు ఘట్టమనేని గౌతమ్.. రికార్డులు షురూ!

తాతకు తగ్గ మనువడు ఘట్టమనేని గౌతమ్.. రికార్డులు షురూ!

సూపర్ స్టార్ కృష్ణ గారి మనువడు, ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల కుమారుడు ఘట్టమనేని గౌతమ్ రికార్డుల పర్వం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అనేక రికార్డులకు ఆదిపురుషుడు సూపర్ స్టార్ కృష్ణ కాగా ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో నెంబర్ వన్ గా దూసుకెళ్తున్నాడు మహేష్ బాబు. వన్ నేనొక్కడినే సినిమాతో తెరంగేట్రం చేసిన గౌతమ్ తాజాగా ఓ రికార్డు సాధించాడు. ఈ విషయాన్ని తల్లి నమ్రత స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్ స్విమ్మింగ్లో తన ప్రావీణ్యతను చూపుతున్నాడు. 2018 నుంచి ప్రొఫెషనల్ స్విమ్మింగ్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న గౌతమ్ తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ కు సంబంధించి తన వయసు వారి విభాగంలో టాప్ 8 పొజిషన్లలో ఒకరిగా నిలచాడు.  ‘‘2018 నుంచి ప్రొఫెషనల్‌ స్విమ్మర్‌గా గౌతమ్‌ సాధన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన ఏజ్‌ గ్రూప్‌కు చెందిన తెలంగాణలోని ప్రొఫెషనల్‌ స్విమ్మర్స్‌ టాప్‌ 8 జాబితాలో గౌతమ్‌ చోటు సంపాదించాడు. గౌతమ్‌ తనకు తానుగానే స్మిమ్మింగ్‌ను ఎంచుకున్నాడు. కష్టపడుతూ, సాధనలో తనకు ఎదురైన సవాళ్ళను స్వీకరిస్తూ వచ్చాడు. చక్కని స్విమ్మింగ్‌ మెళకువలకు కచ్చితమైన వేగాన్ని జోడించి తన నైపుణ్యానికి మరింత పదును పెట్టాడు గౌతమ్‌. స్మిమ్మింగ్‌ బటర్‌ఫ్లైలో ఉన్న నాలుగు రకాలను (బటర్‌ ఫ్లై, బ్యాక్‌స్ట్రోక్, బ్రీస్ట్‌ స్ట్రోక్, ఫ్రీ స్టైల్‌ విత్‌ ఈజ్‌ అండ్‌ గ్రేస్‌) గౌతమ్‌ చక్కగా ప్రదర్శించగలడు. వీటిలో గౌతమ్‌కు బటర్‌ఫ్లై ఫ్రీ స్టైల్‌ అంటే చాలా ఇష్టం. ఈ స్టైల్లో గౌతమ్‌ కంటిన్యూస్‌గా మూడుగంటల్లో ఐదు కిలోమీటర్లు స్విమ్‌ చేయగలడు’’ అని నమ్రత తన ఇన్‌స్టాగ్రమ్‌లో పేర్కొన్నారు.

 

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి