జనవిజయంతెలంగాణతరుగు పేరుతో దోపిడి అరికట్టాలి

తరుగు పేరుతో దోపిడి అరికట్టాలి

  • తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి
  • నెల రోజులు పైగా కాటాలు వేయని దుస్థితి
  • ట్రాన్స్ఫోర్టు చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలి
  • సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

ఖమ్మం,మే21(జనవిజయం): ప్రతిగింజను కొనుగోలు చేస్తాం, అని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కేంద్రంలోని హోల్ టైమర్స్, ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నా కాటాలు వేయటం లేదన్నారు. కాటాలు వేసిన నెల రోజుల దాకా ధాన్యం ట్రాన్స్ పోర్టు చేయటం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తడిస్తే దానికి రైతునే బాధ్యుణ్ణి చేయటం దారుణమన్నారు. తేమ పేరుతో, తరుగు పేరుతో ఇష్టారాజ్యంగా రైతులను దోపిడి చేస్తున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం మాత్రమే తరుగు తీయాలన్నారు. రైతుల ఆందోళనను బలహీనతగా చేసుకొని మిల్లర్లు అడ్డగోలుగా కోతపెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నా ప్రభుత్వ నోరు మెదపడం లేదన్నారు. సన్నధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఏడిపించటం సరికాదని అన్నారు. ప్రతి సంవత్సరం కొనుగోలు చేసే ధాన్యాన్ని ముందుచూపు, ప్లాను చేసుకోకుండా అసమర్ధ చర్యలతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాటాలు వేశాక ధాన్యం భాద్యత రైతుకులేదని అధికారులే బాధ్యత వహించాలని నున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ, నందిపాటి మనోహర్, తుమ్మ విష్ణు, బండారు రమేష్, మాదినేని రమేష్, తుశాకుల లింగయ్య, నాయకులు ఎస్ కె.మీరా, డి. తిరుపతిరావు, మెరుగు రమణ, గౌస్, అమరావతి తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి