కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కాలేదు
- తప్పుడు ప్రచారం నమ్మొద్దు
హైదరాబాద్ జులై 25 (జనవిజయం):
కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అంటూ సోషల్ మీడియాలో, ప్రసార మాద్యమాలలో చక్కర్లు కొడుతున్న జాబితా (లీస్ట్) బోగస్. ఆ లిస్ట్ ను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఎవరు నమ్మవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ తరపున అధికారికంగా ఎలాంటి జాబితాను విడుదల చేయలేదు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పరిశీలన, సర్వేలు జరుగుతున్నాయి. త్వరలో నియోజకవర్గ అభ్యర్థుల పరిశీలన జరిపి లిస్టులను సిద్ధం చేయడం జరుగుతుంది. పీఏసీ, పిఈసి కమిటీలు సమావేశాలు జరిపి నిర్ణయిస్తారు. అందువల్ల నాయకులు, కార్యకర్తలు అపోహలు నమ్మవద్దు.. అబద్ధపు ప్రచారాలపై అప్రమతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.