జనవిజయంజాతీయంతన స్టైల్ పాలన చేస్తున్న సీ.ఎం స్టాలిన్

తన స్టైల్ పాలన చేస్తున్న సీ.ఎం స్టాలిన్

  • తమిళనాట కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు
  • కరోనా కట్టడి లక్ష్యంగా కఠినంగా ఆంక్షలు అమలు
  • కాలు బయటపెడితే చర్యలు తీసుకుంటున్న పోలీసులు
  • సైలెంట్ గా పని చేసుకుంటూ పోతున్న సిఎం స్టాలిన్

చెన్నై,మే26(జనవిజయం): తమిళనాడులో సిఎం స్టాలిన సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతున్నారు. ఎక్కడా ఆర్భాటం కనిపించనీయడం లేదు. నిర్నయాలన్నీ చకచకా జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడి విషయంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అమలు చేస్తూ ఫలితాలు రాబడుతున్నారు. అధికారులు కూడా తలొంచుకుని పనిచేస్తున్నారు. అందుకే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంపూర్ణ లాక్ డౌన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలితో పాటు పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయి పోలీసులు ఈ లాక్ డౌన్ ను ప్రకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ-పాన్ లేదా ఈ-రిజిస్టర్ లేకుండా రోడ్డెక్కే వాహన చోదకుల పట్ల పోలీసుల కఠినంగా నడుచుకుంటున్నారు. అలాగే, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కేసులు కూడా నమోదు చేస్తున్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించేందుకు వీలుగా జిల్లాల సరిహద్దులను కూడా మూసివేశారు. దీంతో ఒక జిల్లాకు మరో జిల్లా మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం సరైన ధృవీకరణ పత్రాలతో అత్యవసరంగా వెళ్ళే వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఇతర వాహనదారులు మాత్రం ఒక జిల్లా నుంచి మరో జిల్లాలోకి ప్రవేశించాలంటే విధిగా ఈ-పాన్ లేదా ఈ-రిజిస్టర్ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ రెండూ లేకుండా రో–డడెక్కె వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

చెన్నై నగరంతో పాటు మదురై,కోయంబత్తూరు, సేలం, తిరుచ్చి వంటి ప్రధాన జిల్లాల్లో లాక్ డౌనను పటిష్టంగా అమలుచేస్తున్నారు. ముఖ్యంగా చెన్నై నగరవ్యాప్తంగా 300కు పైచిలుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, పది వేల మందితో గట్టి నిఘా వేశారు. వీరికితోడు ట్రాఫిక్ పోలీసులు ప్రతి నిగ్నెల్ వద్ద బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా ఉంచి ఆ మార్గంలో వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అంబులెన్స్ సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు నడుచుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులైన అన్నాసాలై, పూందమల్లి హైరోడ్డు, కామరాజర్ శాలై,జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు, రాజీవ్ గాంధీ రోడ్డు, డాక్టర్ రాధాకృష్ణన్ రోడ్డు, జీఎన్ చెట్టి రోడ్డు, జీఎస్టీ శాలై, రాజాజీ శాలై, ఆర్కాట్ రోడ్డు, ఈసీఆర్, తిరువొట్రియూరు హైరోడ్డు, వేళచ్చేరి హైరోడ్డు, ఎల్బీ రోడ్డు, శాంథోమ్ హైరోడ్డు, గ్రీన్ ్వన్ రోడ్డు, మాధవరం హైరోడ్డు, ఇలా ప్రధాన రహదారుల్లో డ్రోన్ కెమెరాలతో వాహనాల రాకపోకలను గమనిస్తున్నారు.

లాక్ డౌన్ ఆంక్షలు పాటించకుండా రోడ్లపై తిరిగే ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేయడమే కాకుండా ద్విచక్రవాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. చెన్నై మహానగరానికి అవసరమైన కూరగాయలను కోయంబేడు మార్కెట్ సరఫరా చేస్తుంది. ఇక్కడ హోల్‌సేల్ వ్యాపారులతో పాటు చిరు వ్యాపారులు కూడా వ్యాపారం చేస్తుంటారు. అయితే, లాక్ డౌన్ కారణంగా ఈ మార్కెట్ ను మూసివేశారు. ఈ మార్కెట్ కు వచ్చే కూరగాయలను చెన్నై నగర పాలక సంస్థ ప్రత్యేక వాహనాల్లో నగర వ్యాప్తంగా విక్రయించేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం లా డౌన్ కాలంలోనూ 30 శాతం మేరకు దుకాణాలు తెరిచివుంచేలా అనుమతి ఇచ్చారు. ఇకపోతే పాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎవ్వరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని పాడి పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ఎం నాజర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంగా అన్నదాతల జీవనశైలిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న ఆవిన్ పాల డైరీలు, పార్లర్లు, ఏజెన్సీలకు వెళ్లి ఆకస్మికతనిఖీలు చేపడుతున్నారు. పాలు, పాల ఉత్పత్తుల నాణ్యత గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. లాక్ డౌన్ రోజుల్లో అన్నదాతలు ఆర్థికంగా నలిగిపోకూడదన్న దృష్టితో గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు అదనంగా 2 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పాల కోసం కో-ఆపరేటివ్ సొసైటీలు ఎప్పటికప్పుడు రైతులకు నగదు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి