జనవిజయంఅంతర్జాతీయందేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

  • గడిచిన 24 గంటల్లో 2,22,315 కేసుల నమోదు
  • మరో 4,454 మంది వైరస్‌తో మృత్యువాత
  • కరోనా నివారణకు ఎన్నారై డాక్టర్ల కృషి

న్యూఢిల్లీ,మే24(జనవిజయం): భారత్‌పై కరోనా కాఠిన్యం చూపుతోంది. కుటుంబాల్లో ఇష్టమైన వారిని దూరం చేసి ఆ ఇంట్లో విషాదాన్ని నింపుతోంది. ఇప్పటికే మూడు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 2,22,315 మంది కరోనా బారిన పడగా…4,454 మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటి వరకు 2,67,52,447 మంది కరోనా బారిన పడగా….3,03,720 మంది మరణించారు. తాజాగా 3,02,544 మంది కోలుకోగా…మొత్తంగా 2,37,28,011 మంది ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 క్రియా శీలక కేసులున్నాయి. తమిళనాడు కరోనా కేసుల నమోదులో ముందంజలో ఉంది. అక్కడ 35,483 కేసులు, మహారాష్ట్ర 26,672, కర్ణాటక 25,979, కేరళ 25,820, ఆంధ్ర 18,767 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్లరా నుండే సుమారు 59.7 శాతం కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇదిలావుంటే ఢిల్లీలో పాజిటివిటీ రేటు కూడా 2.42 శాతానికి తగ్గింది. ఢల్లీిలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆదివారం ప్రకటించారు. కొత్త కేసుల సంఖ్య తగ్గికపోతే ఈ నెల 31 నుంచి దశలవారీగా అన్‌లాక్‌ను ఎత్తివేస్తామని వెల్లడించారు. మూడో దశ రాకుండా అడ్డుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా ఢిల్లీీ ప్రజలకు వ్యాక్సిన్‌ వేయాలని తెలిపారు. ఇక పుదుచ్చేరిలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు లెప్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై ఆదివారం తెలిపారు. హరియాణాలోనూ లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించారు. రాజస్థాన్‌లో వచ్చే నెల 8 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. మరోవైపు కరోనాపై పోరులో భారత్‌కు సహకరించేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, వృత్తి నిపుణులు ముందుకొచ్చారు. కరోనా రెండో దశ భారత్‌లోని గ్రావిూణ ప్రాంతాలను వణికిస్తున్న నేపథ్యంలో ’ప్రాజెక్ట్‌ సహాయం(మదత్‌)’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమెరికా, భారత్‌లోని వైద్యులు, వృత్తి నిపుణులు కలిసి దీన్ని మొదలుపెట్టారు. గ్రామాల్లోని కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే ఆరోగ్య సిబ్బందికి వర్చువల్‌గా సమాచారాన్ని అందిస్తుంటారు. ఆస్పత్రుల్లో పడక లభ్యత, వ్యాక్సిన్‌ సమాచారం అందిస్తారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది, ఆర్‌ఎంపీ వైద్యులకు సరైన శిక్షణ అందించే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న రాజా కార్తికేయ తెలిపారు. తద్వారా గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. సహాయం ప్రాజెక్టు బృందం ప్రాథమికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో ఆర్‌ఎంపీలతో కలిసి పనిచేస్తోందన్నారు. త్వరలోనే ఇతర ప్రాంతాలకూ సేవలను విస్తరించి కొవిడ్‌ రోగులకు అవసరమైన చికిత్స, ఇతర సహాయ సహకారాలు అందించనున్నట్లు కార్తికేయ తెలిపారు. న్యూయార్క్‌లో ఉంటున్న కార్తికేయ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొవిడ్‌పై గ్రావిూణ ప్రజలు అప్రమత్తంగా లేరన్నారు. ఉదాహరణకు కరీంనగర్‌లో 70%-80% కేసులు గ్రావిూణ ప్రాంతాల నుంచే వస్తున్నట్లు తెలిపారు. గ్రావిూణ ప్రజల్లో భయాన్ని పారద్రోలి, వారికి మెరుగైన చికిత్స అందేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. స్వల్ప లక్షణాలున్న కొవిడ్‌ రోగులను ఎలా రక్షించాలన్న అంశంపై ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపైనే దృష్టి సారించినట్లు వెల్లడిరచారు. అమెరికాలో గత ఏడాది తమకు ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని, వాటిని భారత్‌లోని గ్రామాల్లో వైరస్‌ కట్టడికి అమలు చేస్తామని తెలిపారు. జూమ్‌ ద్వారా వారానికి రెండు రోజులు ఆర్‌ఎంపీలతో సమావేశమవుతామన్నారు. రెండు తెలుగు రాష్టాల్లో ఇప్పటికే 150 మందికి పైగా ఆర్‌ఎంపీలతో భేటీ అయినట్లు వివరించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్లతకు వైద్యపరమైన సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు అందజేస్తారని తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి