జనవిజయంజాతీయందేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

లాక్డౌన్ తో సత్ఫళితాలు ఇస్తున్న కరోనా కట్టడి చర్యలు
3లక్షలకు దిగువన కొత్త కేసుల నమోదు
ఒక్కరోజే 4,106 మంది మృత్యువాత

న్యూఢల్లీ,మే17(జనవిజయం): భారత్ లో కరోనా విషయంలో కాస్త ఊరటనిచ్చేలా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసబెట్టి పెరుగుతున్న కేసులు లాక్‌డౌన్‌ కట్టడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా విషయంలో కేర్‌ తీసుకోవడంతో కేసుల సంఖ్య గత నాలుగు రోజులుగా కాస్త తగ్గుతూ వస్తోంది. నాలుగు రోజులకు ముందు 4లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఆ తరువాత రోజురోజుకూ ఆ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దేశంలో కొత్తగా 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 4,106 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 35,16,997 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 2.49 కోట్లకు చేరుకుంది. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 2,74,390 మంది మృతి చెందారు. దేశంలో కరోనా కేసులు 3 లక్షల దిగువకు నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. గడిచిన 24 గంటల్లో 4,106 మంది మరణించగా… 2,81,386 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తంగా 2,49,65,463కు కేసులు చేరుకోగా… 2,74,390 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 3,78,741 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 2,11,74,076 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియా శీలక కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 35,16,997 యాక్టివ్‌ కేసులున్నాయి. మహారాష్ట్రలో 34,389 కేసులు, తమిళనాడు 33,181, కర్ణాటక 31,531, కేరళ 29,704, ఆంధ్రప్రదేశ్‌ 24,171 కేసులున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండే సుమారు 54.37 కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా కరోనాతో అల్లాడిపోయిన భారత్‌ లో క్రమేపీ వైరస్‌ తగ్గుముఖం పట్టనట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా 4 లక్లలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 84.25 శాతంగా ఉండడం గమనార్హం. మరణాల రేటు 1.09గా ఉంది. ఢల్లీ, యూపీ, తెలంగాణ, బీహార్‌, మధ్యప్రదేశ్‌, గోవా, ఛత్తీస్‌ ఘడ్‌, గుజరాత్‌, జార్ఖంఢ్‌ రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఏపీ, కేరళ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమౌతున్నాయి. ఇకపోతే దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి