జనవిజయంజాతీయం3 లక్షల దిగువకు రోజువారీ కోవిడ్ కేసులు

3 లక్షల దిగువకు రోజువారీ కోవిడ్ కేసులు

న్యఢిల్లీ, మే 18 (న్యూస్‌టైమ్): గత 26 రోజులలో మొదటి సారిగా రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 3 లక్షల దిగువకు పడిపోవటం ఆశాజనక పరిణామం. గత 24 గంటల్లో 2,81,386 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.ఈ నెల 9 వ తేదీ నూమ్చి కొత్త కెసులు తగ్గిముఖం పట్టటాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది. వారపు పాజిటివిటీ శాతం తగ్గటాన్ని ప్రతిబింబిస్తూ ఈరోజు 18.17% నమోదైనట్టు క్రింది చిత్రపటం చూపుతోంది. గత 24 గంటలలో జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 15,73,515 కాగా, ఇప్పటిదాకా దేశమంతటా జరిపిన మొత్తం పరీక్షలు 31,64,23,658. రాష్ట్రాలవారీగా అత్యధిక స్థాయిలో పాజిటివ్ కెసులు నమోదవుతున్న జిల్లాల వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి. కర్నాటకలో అత్యధికంగా 27 జిల్లాల్లో 20% పైగా పాజిటివిటీతో కేసులు ఎక్కువగా వస్తుండగా మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో 38 జిల్లాల్లో 10% మించి పాజిటివిటీ నమోదవుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 2,11,74,076కు చేరింది. అందువలన జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 84.81% అయింది. గత 24 గంటలలో 3,78,741 మంది కోలుకున్నారు. అదే సమయంలో కొత్త కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం గత 7 రోజుల్లో 6 సార్లు కాగా వరుసగా నాలుగురోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. కొత్తగా కోలుకున్నవారిలో 71.35% మంది పది రాష్ట్రాలకు చెందినవారు. మరోవైపు దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య తగ్గి 35,16,997 కు చేరింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 14.09%. గత 24 గంటలలో చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య నికరంగా 1,01,461 కేసుల తగ్గుదల నమొదు చేసుకుంది. ఇందులో పది రాష్ట్రాల వాటా 75.04% ఉంది. దేశవ్యాప్తంగా మూడో విడత టీకాల కార్యక్రమం కూదా మొదలవటంతో ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కోవిడ్ డోసులు దాదాపు 18.30 కోట్లకు చేరాయి. ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం మొత్తం 18,29,26,460 డోసులను 26,68,895 శిబిరాల ద్వారా పంపిణీచేశారు. అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 96,45,695 మొదటి డోసులు, 66,43,661 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,44,44,096 మొదటి డోసులు, 81,96,053 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారికిచ్చిన 52,64,073 మొదటి డోసులు, 45-60 వయోవర్గానికిచ్చిన 5,72,78,554 మొదటి డోసులు, 91,07,311 రెండో డోసులు, 60 పైబడ్డవారికిచ్చిన 5,45,15,352 మొదటి డోసులు, 1,78,01,891 రెండో డోసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసులలో పది రాష్టాలవాటా 66.73% ఉంది. 18-44 వయోవర్గానికి చెందిన 4,35,138 మంది లబ్ధిదారులు గత 24 గంటలలో మొదటి డోస్ అందుకున్నారు. దీంతో 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 52,64,073 కు చేరింది. ఆ సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది. గత 24 గంటలలో దాదాపు 7 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాలు మొదలైన 121వ రోజైన మే 16 నాడు 6,91,211 టీకాలు 6,068 శిబిరాల ద్వారా ఇవ్వగా అందులో 6,14,286 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 76,925 మంది రెండో డోస్ తీసుకున్నారు. తాజాగా నిర్థారణ అయిన కరోనా కేసుల్లో 75.95% పది రాష్ట్రాలకు చెందినవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 34,389 కేసులు, ఆ తరువాత స్థానంలో ఉన్న తమిళనాడులో 33,181 కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో మరణాల శాతం 1.10% గా నమోదంది. గత 24 గంటలలో 4,106 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 75.38% ఉండగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులో 974 మంది, కర్నాటకలో 403 మంది కోవిడ్ తో చనిపోయారు . విదేశీ సాయానికి తోడుగా సహాయ సామగ్రిని అత్యంత వేగంగా రాష్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటిదాకా దాకా మొత్తం 11,058 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు; 13,496 ఆక్సిజెన్ సిలిండర్లు; 19 ఆక్సిజెన్ తయారీ ప్లాంట్లు; 7,365 వెంటిలేటర్లు; దాదాపు 5.3 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగాయి. రోడ్డు, వాయు మార్గాల ద్వారా ఈ పంపిణీ కొనసాగుతోంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి