జనవిజయంఆరోగ్యంస్వీయ రక్షణతోనే కరోనా కట్టడి

స్వీయ రక్షణతోనే కరోనా కట్టడి

భారత్‌లో నానాటికీ విస్తరిస్తున్న కరోనా సెకండ్ వేవ్ తన మన అన్న తేడా చూడకుండా అందరినీ ఓ చూపు చూడాలని పగబట్టినట్లు కనిపిస్తోంది. విపత్తువేళ, నిజంగానే ఇది ప్రజలకు పరీక్షా సమయమే. అయితే, మహమ్మారిపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిని గుర్తుంచుకుని స్వీయ నియంత్రణ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొంత వరకు రక్షణ పొందవచ్చు. గత ఏడాది దేశం యావత్తు ఐక్యంగా నిలిచి కరోనాను ఓడించింది. అదే విధంగా మరోసారి ఐక్యంగా పోరాడి సత్వరం కరోనాను ఓడించాలి. వ్యాధితో పోరాడే శక్తిని మనకు ఇచ్చేందుకు భారతీయ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొందే వరకు మనం మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి. నిరంతర ఔషధ సరఫరాకు, ఆస్పత్రుల్లో సదుపాయాల మెరుగుదలకు ప్రజల కష్టనష్టాలు తెలిసినదేశ నాయకత్వం తగు చర్యలు తీసుకుంటోంది. అందువల్ల ఎలాంటి ఆందోళనకు లోను కావద్దు. వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ముందు జాగ్రత్త చర్యలు పాటించండి.

కరోనాపై పోరాటం కావచ్చు, వివిధ కార్యక్రమాల ద్వారా మార్పును తీసుకురావడం కావచ్చు అన్నింటిలోనూ ప్రజా భాగస్వామ్యం కొత్త దిశ చూపించింది. ఈ కారణంగానే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు కేవలం కొన్ని వర్గాలకే పరిమితం అయిన ఎల్.పి.జి సరఫరా ఇప్పుడు గ్రామాలకు, పేద ప్రజలకు విస్తరించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఆరోగ్య, పర్యావరణ వంటి కీలకాంశాలతో పాటు సగటు ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచగల సామర్థ్యానికి ఒక చక్కని ఉదాహరణగా నిలవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ స్క్రీమ్ ప్రారంభించి ఆరు సంవత్సరాలు పూర్తవుతోంది. జీవన సౌలభ్య సూచిలో అద్భుతమైన మార్పునకు కారణం ఉజ్వల పథకమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా బీమా పథకాలు కూడా సగటు జీవిని సాధికారం చేయడంలో అత్యంత కీలకంగా నిలుస్తున్నాయి.

స్వాతంత్య్ర పోరాటం కావచ్చు, విదేశీ ఆక్రమణదారులను తరిమికొట్టడం కావచ్చు దేశ అంతర్గత బలానికి దర్పణం పడతాయి. యువతరం జీవితంలోని సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చో తెలియచేసేందుకు ప్రధానమంత్రి వారితో ముఖాముఖి నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’కు కోవిడ్ విపత్కర సమయంలోనూ మంచి ప్రాధాన్యత లభిస్తుండడం విశేషం. అదే సమయంలో భారత్‌ను ఆత్మనిర్బర్‌గా తీర్చిదిద్దాలన్న సంకల్పం ప్రతీ ఒక్కరికీ చోదకశక్తిగా ఉంది. గత ఏడాది కాలంలో అది తీసుకువచ్చిన పరివర్తన దేశంలోని 137 కోట్ల మంది భాగస్వాములు కాకపోతే సాధ్యమయ్యేది కాదు.

ముందే చెప్పుకొన్నట్లు దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ అందరినీ భయపెడుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు, వ్యాక్సిన్‌నేషన్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్‌ అని చెప్పిన ఆరు రోజులు గడిచినా ఇంకా సమస్యలే. ధర్డ్ ఫేజ్ వ్యాక్సినేషన్లో బాగంగా 18–45 ఏళ్ల వయస్సు వారికి టీకా వేసే కార్యక్రమం చాలా రాష్ట్రాల్లో అసలు ప్రారంభం కాలేదు. కేవలం 9 రాష్ట్రాల్లోనే కొద్ది శాతానికి వ్యాక్సిన్లు వేశారు. రాష్ట్రాలన్నీ కేంద్రం తమకు అవసరమైనన్ని వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి. వ్యాక్సిన్లన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు వెళుతున్నాయనేది మరో ఆరోపణ. 18 ఏళ్ల పైబడిన మూడున్నర కోట్ల మంది కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరిలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే టీకాలు అందినట్లు అయా రాష్ట్రాలు చెబుతున్నాయి.

అయితే, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వాక్సిన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 89 లక్షల వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో మరో 28 లక్షల వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 17 కోట్ల 15 లక్షల 42 వేల 410 వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా అందించినట్లు తెలిపింది. ఇందులో మొత్తం 16,26,10,905 వ్యాక్సిన్‌ డోసులను ఇప్పటి వరకు ప్రజలకు అందించారు. ఈ లెక్కన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 89 లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో వినియోగం కూడా అధికంగానే ఉంది.

కేంద్రం అందిస్తున్న వ్యాక్సిన్‌లను రాష్ట్రాలు సరిగా సర్దుబాటు చేసుకోకపోవడం వల్ల కొన్ని చోట్ల వ్యాక్సిన్‌ కొరత కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో 28 లక్షల వ్యాక్సిన్‌లు అందిస్తామని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ మార్గదర్శకాలను కేంద్రం సవరించిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ పోర్టల్‌ లేదా ఆరోగ్యసేతులలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా దగ్గరిలోని ఆరోగ్య కేంద్రం వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇదిలావుంటే, 18–44 ఏళ్ల కేటగిరిలో గుజరాత్‌లో రెండు లక్షలు, రాజస్థాన్‌లో లక్ష 26వేలు, మహారాష్ట్రలో కోటి 11 లక్షల మందికి వ్యాక్సిన్ అందినట్లు సమాచారం. గుజరాత్‌, రాజస్థాన్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ అందుబాటులో ఉంది. మహారాష్ట్రలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ ప్రజలకు అందాయి. హర్యానాలో దాదాపు లక్ష మందికి టీకా అందగా ఢిల్లీలో 80 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడో దశ ఇంకా ప్రారంభం కాలేదు. రష్యా నుంచి స్పుత్నిక్ వి టీకా‌తో పాటు అమెరికా నుంచి వ్యాక్సిన్ డోసులు త్వరలో భారత్ రానున్నాయి. అవన్నీ వస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమం పికప్ అవుతుందని అంటున్నారు అధికారులు.

ఇకపోతే, ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత కర్నాటకలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వం 18 ఏళ్ల పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు వెయ్యడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రకటించింది. ఫస్ట్ డోస్ వేసుకున్న వారికి సెకండ్ డోస్ వెయ్యడానికి అష్టకష్టాలు పడుతోంది యడ్యూరప్ప ప్రభుత్వం. గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జనవరిలో ప్రారంభించినా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3.2 కోట్ల మందికే రెండు డోసులు వ్యాక్సిన్ వేశారు. 13 కోట్ల మందికి ఫస్ట్ డోస్ వేశారు. కావలసినన్ని డోసులు అందుబాటులో లేకపోవడం, కేసులు పెరుగుతూ ఉండటంతో రాష్ట్రాలు లాక్‌డౌన్‌ పెడుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలానే ఉంది. ఏపీలోని కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో వృద్ధులు వ్యాక్సిన్ కోసం వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఈ నెల 15లోగా 9 లక్షల వ్యాక్సిన్ డోసులు వస్తాయని, వాటిని 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసుగా వేస్తామని ఏపీ సర్కారు ప్రకటిచింది. వాళ్లకు వేసిన తర్వాత మిగిలిన డోసుల్ని 45 ఏళ్లు నిండిన ఆర్టీసీ, బ్యాంకు ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు మొదటి డోసుగా వేస్తామంది. మరోవైపు, ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్ని కఠినంగా అమలు చేస్తున్నారు.

అక్కడ ప్రతీ రోజూ 20వేల కేసులు వస్తున్నాయి. వ్యాక్సిన్లతో పాటు ఆక్సిజన్ కొరత కూడా పెరుగుతోంది. మూడో విడత వ్యాక్సినేషన్ ప్రారంభించే నాటికి కొన్ని రాష్ట్రాల దగ్గర ఐదు లక్షల డోసులు ఉంటే మరి కొన్ని రాష్ట్రాల దగ్గర లక్ష డోసులే ఉన్నాయి. తమకు వ్యాక్సిన్లు కావాలంటా రాష్ట్రాలన్నీ సీరం ఇన్‌స్టిట్‌ట్యూట్‌కు లేఖలు రాస్తున్నాయి. తెలంగాణలోనూ వ్యాక్సిన్ల కొరత ఉంది. ఉన్న వ్యాక్సిన్లను 45 ఏళ్ల పైబడిన వారికే వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్ వెయ్యవచ్చని, అయితే, వాళ్లు సొంతంగా సమకూర్చుకోవాలని సూచించింది తెలంగాణ ఆరోగ్యశాఖ. మరోవైపు, దేశవ్యాప్తంగా ఇప్పటి వకూ 8 లక్షల డోసులు వృధా అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోజూ 18 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇదే స్పీడుతో దేశ ప్రజలందరికీ టీకాలు వెయ్యాలంటే రెండేళ్లు పట్టే అవకాశముందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి