భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 10 (జనవిజయం): స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను కోరారు. ఇందుకు మైదానాన్ని సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేడుకలు నిర్వహణపై గురువారం కలెక్టర్ కొత్తగూడెం పట్టణంలో ప్రగతి మైదానం, హేమచంద్రపురంలోని పోలీస్ మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే అతిధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంక్షేమ శాఖల అధికారులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయుటకు స్టాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. మైదానంలో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రం చేయాలని, మున్సిపల్ కమిషనర్ మంచినీళ్లు సరఫరా చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, ఏఎస్పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.