స్వరం పెంచి సంగతి తేల్చిన తుమ్మల

0
210
Share this:

 

సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెరదించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారడం లేదంటూ స్పష్టం చేశారు. అలాంటి అగత్యం, కర్మ తనకు పట్టలేదని. ఓపికతో ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయకత్వంలో తనకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ ఖమ్మం జిల్లా అభివ్రుద్ధికి పాల్పడతానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నలబై ఏండ్ల రాజకీయ జీవితంలో తానేంటో జిల్లా ప్రజలకు తెలుసునన్నారు. ఏనాడూ స్వలాభం కోసం కాక జిల్లా అభివ్రుద్ధికే పాటుపడిన సంగతి మీడియా మిత్రులకు గుర్తు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్న ఐదుగురు వ్యక్తులపై సైబర్ నేరాల పరిధిలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లిప్పింగ్ ఆధారాలతో గురువారం పోలీసు కమీషనర్ తఫ్షీర్ ఇక్బాల్ కు వినతి పత్రం సమర్పించారు.

దుబ్బాక దెబ్బతో రాష్ట్రవ్యాపైతంగా పార్టీ పటిష్టతకు యుద్ధప్రాతిపదికన ముఖ్యమంత్రి చర్యలు చేపట్టిన నేపధ్యంలో తుమ్మలను మళ్లీ ఏక్టివ్ కావాలని కోరడం, జిల్లాలో రైతువేదికల ప్రారన్బోత్సవంలో ఆయన పాల్గొనడంతో జిల్లాలో రాజకీయ ఊహాగానాలు ఊపందుకున్నాయి. టీ.అర్.ఎస్ లో ప్రముఖ నేతలను బి.జె.పీ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోందని దానిలో బాగంగా తుమ్మల బా.జా.పాలోకి జంప్ అవుతారన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. వీటిని తుమ్మల కూడా ఖండిచకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. మంత్రిగా ఉన్న తుమ్మల గత ఎన్నికలలో పాలేరులో స్వపక్షం వెన్నుపోటుతో ఓడిపోయిన విషయం తెలిసిందే. నాటి నుండి ఆయన తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితం కావడం, మంత్రి అజయ్ వర్గం సోషల్ మీడియా వేదికగా కించపరస్తూ పోష్టులు ఉంచినా ఆయన మౌనంగానే ఉన్నారు. ఎవరే విధంగా ప్రవర్తించినా తుమ్మల తొందరపడలేదు. ఈ వైఖరే ఆయనను మరోసారి అందలం ఎక్కిస్తోందనిపిస్తోంది. తిరిగి తుమ్మల ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా వ్యవహరించనున్నట్లు ఈ మేరకు సీ.ఎం కే.సీ.ఆర్ తుమ్మలకు హామీ ఇచ్చినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తుమ్మల స్వరం మారింది. మౌనం వీడారు. ఇకపై తాను యాక్టివ్ కానున్నట్లు చెప్పకనే చెప్పడంతో తమ నేతకు పూర్వ వైభవం వస్తోందని ఆయన అనుచరులు, టీ.అర్.ఎస్ అభిమానులు ఆన౦దం వ్యక్తం చేస్తున్నారు. జీ.హెచ్.ఎం.సీ ఎన్నికలలో కూడా తాను పార్టీ గెలుపుకోసం పని చేస్తానని ప్రకటించారు. ఎవరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారో వారి ఆశలు నెరవేరవన్నారు. నీచమైన నిక్రుష్టమైన స్వలాభాపేక్షాపరులు అద్రుష్టంతో నాయకులుగా ఎదిగిన వారే తన ఇమేజ్ ను తగ్గించడానికి చేస్తున్న౦దుకు బాధ పడుతున్నట్లు తెలిపారు. అసాధారణ రీతిలో ఓడిన నన్ను మంత్రిని చేసి అడిగిన అన్ని అభివ్రుద్ది పనులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కె.సీ.ఆర్ తనకు చిరకాల మిత్రుడని ఖమ్మం జిల్లాకు ఇతర జిల్లాలకంటే ఎక్కువ నిదులు పనులు మ౦జూరు చేయించినట్లు తెలిపారు. ఇరవై వేల కోట్లతో సీతారామ, బక్తరామదాసు ప్రాజెక్టులు ఇతర ఎత్తిపోతల ఇరిగేషన్ పనులు, అనేక జాతీయ రహదారులు తెప్పించామన్నారు. ఖమ్మం నగరాన్ని అందమ్గా తీర్చిదిద్దామన్నారు. అన్ని రహదారులను సెంటర్లైన్ చేస్ సిక్ష్ లైన్ చేయడం, ద్వంసలాపురం బ్రిడ్జ్, 200 కోట్లతో ఖమ్మం నగరానికి ఇంటింటికీ నీటి పారుదల, వందకోట్లతో గోళ్లపాడు చానల్ నిర్మాణ వంటి అనేక అభివ్రుద్ది పనులను వివరించారు. ఇలా అన్ని రకాలుగా సహకారం అంది౦చిన కే.సీ.ఆర్ ను కాదని పార్టీ మారాల్సిన గతి, అగత్యం తనకు లేదన్నారు. ఎవరైతే పార్టీ ఓటమికి కారకులయ్యారో ఇప్పుడు కూడా నీచమైన, నిక్రుష్టమైన పనులు చేస్తున్నారని, ఇలాంటి చిల్లర పనులుతో ఖమ్మం జిల్లా అభివ్రుద్ధికి నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఇంత అభివ్రుద్ధి చేసినా గత అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రానందునే మౌనంగా ఉన్నాను తప్ప రాజకీయాలు తెలియకనో, చేతకాకనో, రాజకీయాలకోసమో కాదని తేల్చి చెప్పారు. జీ.హెచ్.ఎం.సీతో పాటు ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా పార్టీ అభివ్రుద్ధికి సహకరించనున్నట్లు తెలిపారు.

ఖమ్మంలో తుమ్మల తేల్చి చెప్పడం …. ప్రత్యర్ధులకు తీవ్ర స్వరంతో వార్ని౦గ్ ఇవ్వడంతో జిల్లా రాజకీయపరిణామాలపై ఊహాగానాలాలో కొంత క్లారిటీ వచ్చినట్లే. అద్రుష్టంతో నాయకులై పార్టీని ఓడించిన భ్రష్టులెవరు? వారు పార్టీలో ఉంటారా? జంప్ అవుతారా? అనేది తేలాల్సి ఉంది.

పల్లా కొండలరావు,
18-11-2020.

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.