జనవిజయంఆంధ్రప్రదేశ్సూర్యచంద్రులున్నంత వరకూ ఎన్.టి.ఆర్ పేరుంటుందన్న మోత్కుపల్లి

సూర్యచంద్రులున్నంత వరకూ ఎన్.టి.ఆర్ పేరుంటుందన్న మోత్కుపల్లి

  • ఎన్టీఆర్‌కు పలువురు నివాళి
  • ఘాట్ వద్ద నివాళి అర్పించిన చంద్రబాబు, లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి తదితరులు

హైదరాబాద్,మే28(జనవిజయం): నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ ఘాట్ లో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు రాజీపడకుండా పోరాడే వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పక్కా గృహాలను, గురుకుల పాఠశాలలను పరిచయం చేసిందే ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి వారసత్వ సంపద, రామారావు జీవితం భావి తరాలకు ఆదర్శమన్నారు. దేవుడిని ఎన్టీఆర్ లో చూసుకున్న రోజులున్నాయని, దేవుడి పాత్రల్లో ఎన్టీఆర్ జీవించాడన్నారు. ఆచరణ సాధ్యం కాని పనులను సైతం ఎన్టీఆర్ చేసి చూపించారని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్ , దేవాన్ష్, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతిని పురస్కరిం చుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా, అసాధ్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని నమసమాజ స్థాపనకు కృషి చేద్దామని అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీ పార్వతి, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతూ.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ ఆశీర్వాదం, పేదల ఆశీర్వాదం వల్లే తాను మళ్ళీ బతికానన్నారు. వ్యవస్థ బాగు పడాలని అవినీతి రహిత పాలన అందించాలని పరితపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అధికారం కోసం, డబ్బుల కోసం కాకుండా పేదల కోసం పని చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. తాను వేరే పార్టీలో ఉన్నా. ఆయన శిష్యుడిగా మహనీయుడు జయంతి నాడు స్మరించుకుంటున్నానని మోత్కుపల్లి పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి