వినోద ధియేటర్ ముందు మహేష్ అభిమానుల సందడి
ఖమ్మం, మే31(జనవిజయం): ఖమ్మం వినోద ధియేటర్ ముందు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు సందడి చేశారు. బుధవారం సాయంత్రం హీరో కృష్ణ జన్మదినం సందర్భంగా సూపర్ స్టార్ నటించిన మోసగాళ్ళకు మోసగాడు రీరిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు బాణసంచా కాల్చారు. సూపర్ స్టార్ అమర్ రహే, జై బాబు జైజై బాబు అంటూ నినాదాలు చేశారు. కృష్ణ, మహేష్ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ధియేటర్ ముందు పూలు జల్లి సందడి చేశారు. అనంతం ధియేటర్ లో మోసగాళ్ళకు మోసగాడు చిత్రం ప్రదర్శనకు ముందు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న మహేష్ 28వ సినిమా గుంటూరు కారం ట్రైలర్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా కూడా అభిమానుల కేకలతో ధియేటర్ దద్దరిల్లింది.