జనవిజయంజాతీయంసుగంధ ద్రవ్యాల రైతులకు అంతర్జాతీయ మార్కెట్

సుగంధ ద్రవ్యాల రైతులకు అంతర్జాతీయ మార్కెట్

న్యూఢిల్లీ, మే 18 (జనవిజయం): భారత సుగంధ ద్రవ్యాల బోర్డు దేశీయ రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ను చేరువ చేసేందుకు యు.ఎస్.డి.పి.తో కలిసికట్టుగా పని చేస్తోంది. సుగంధ ద్రవ్యాల సాగులోని రైతులను మార్కెట్‌తో అనుసంధానం చేస్తూ రూపొందించిన ఇ-స్పైస్ బజార్‌ను బ్లాక్ చైన్స్ టెక్నాలజీతో అనుసంధానం చేయడం ద్వారా ఇది సాధిస్తుంది. 2021 మే నాటికి ఈ బ్లాక్ చైన్ ఇంటర్ ఫేస్ సిద్ధం అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపిక చేసిన జిల్లాల్లోని 3,000 మందికి పైగా మిర్చి, పసుపు సాగులోని వ్యవసాయదారులకు ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా వర్తింపచేస్తారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు. 2019-20లో భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 300 కోట్ల డాలర్లు దాటాయి. భారత్‌లో వ్యవసాయం ఒక వ్యక్తితో నడిచే పనికాదు. అది ఒక సామూహిక వ్యవహారం. రైతు సేద్యం చేస్తారు.

ప్రభుత్వం అతనికి విద్యుత్, ధరల విషయంలో చట్టపరమైన సహకారం అందిస్తుంది. ప్రైవేటు వ్యాపారులు పంటకు విలువను జోడిస్తారు. దాన్ని వినియోగదారుడి దగ్గరకు చేర్చే పాత్రను మార్కెట్‌ పోషిస్తుంది. అయితే, ఈ వ్యవస్థలోని కొందరి అసమర్థత కారణంగా దేశంలో అదనపు ఉత్పత్తి ముఖ్యంగా వరి, గోధుమల విషయంలో ఎక్కువగా జరిగింది. 1950లో సుమారు 5 కోట్ల టన్నులుగా ఉన్న ఈ అదనపు ఉత్పత్తి, నేడు 50 కోట్ల టన్నులకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ దేశంలోని పంటల దిగుబడి రేటు మాత్రం తక్కువగానే ఉంది. ప్రపంచ సరాసరి దిగుబడితో పోల్చినప్పుడు ఈ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా తర్వాత అత్యధిక శాతం వ్యవసాయ భూమి ఉన్న దేశం భారత్. దిగుబడిలో మాత్రం ఆ దేశం కన్నా నాలుగురెట్లు వెనకబడి ఉంది. భారత్‌తో పోల్చినప్పుడు చైనాలో సేద్యపు భూమి తక్కువ, కానీ దిగుబడి ఎక్కువ. భారతదేశపు సగటు వ్యవసాయ భూకమతం వినియోగం 1.08 హెక్టార్లు కాగా చైనాలో అది 0.67 హెక్టార్లుగా ఉంది. కానీ ఆ దేశ వ్యవసాయోత్పత్తి భారత్‌ కన్నా మూడింతలు ఎక్కువ.

భారతదేశంలో వ్యవసాయం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు, భూగర్భజలాలు నీటి యాజమాన్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తాయి. సేద్యానికి ఆరోగ్యకరమైన, పోషకాలున్న నేల అవసరం. అనేక జీవ క్రియలు జరిగేందుకు అవసరమైన వాతావరణం ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన నేల ఉపరితలం భూసారాన్ని కాపాడి పోషక విలువలున్న పంటలను అందిస్తుంది. అయితే అనేక కారణాల వల్ల ఈ వ్యవసాయ రంగంలోఈ శృంఖలం(చైన్‌) తెగిపోయిందని, దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భారతదేశంలోని వ్యవసాయ యోగ్యమైన నేలలో 40శాతం ఇప్పటికే దెబ్బతిన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి చెడిపోవడం వల్ల అది నిస్సారంగా మారుతుంది. అశాస్త్రీయమైన వ్యయసాయ పద్దతులు, నేలను పదేపదే ఉపయోగించడం, నీటివృథా, అడవుల నరికివేత, రసాయన ఎరువుల అతి వాడకంలాంటివన్నీ భూసారం తగ్గడానికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి కూడా ప్రాణం ఉంటుందని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీలో పని చేస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ రతన్‌లాల్‌ అన్నారు. ఆయన ఇటీవలే సుప్రసిద్ధ ‘వరల్డ్‌ ఫుడ్ ప్రైజ్‌’ను గెలుచుకున్నారు. డాక్టర్‌ రతన్‌లాల్‌ అభిప్రాయం ప్రకారం భూమి ఒక జీవం ఉన్న పదార్ధం.

2011లో నిర్వహించిన సర్వే ప్రకారంలో భారతదేశంలో సరాసరి వ్యవసాయ కమతం వైశాల్యం రెండు హెక్టార్లకంటే తక్కువగా ఉందని తేలింది. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూమిలో నాలుగింట ఒకవంతు కమతాలు 0.4 హెక్టార్లకన్నా తక్కువేనని తేలింది. ఆధునిక వ్యవసాయ విధానాలు, సమర్ధవంతమైన భూ వినియోగం, నీటి వనరుల నిర్వహణ దిగుబడిని పెంచడానికి చాలా ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూసారం పెంచడంతోపాటు, సాంకేతికతను అధికంగా వాడినప్పుడు దిగుబడులు పెరుగుతాయని, శాటిలైట్ల ద్వారా భూసార పరిస్థితులను గుర్తించి వాటిని మెరుగుపరచడం ద్వారా ఫలితాలు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాలపై స్పష్టమైన అంచనా దిగుబడిపై ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. 2018-19 సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలు భారత జీడీపీలో 17శాతం మాత్రమే భాగస్వామ్యం పంచుకున్నాయని తేలింది. కానీ 60శాతానికి పైగా ప్రజలు ఈ రంగంపై ఆధారపడ్డారు.

భారత ఆర్ధికవ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న సేవారంగం 54.3శాతం, పారిశ్రామిక రంగం 29.6శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ రెండు రంగాలు అతి కొద్దిమందితో నడుస్తూ, మూడింట రెండువంతుల జీడీపీని అందిస్తున్నాయి. సాంకేతికతను పెంచడం, మెరుగైన సాగునీటి పద్దతులు అవలంబించడం వల్ల దిగుబడులను పెంచడానికి అవకాశం ఉంటుంది. తక్కువ భూమిలో ఎక్కువ పంటను తీయడంవల్ల శ్రామికుల అవసరం తగ్గుతుంది. అందుకే రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం సంస్కరణల దిశగా దృష్టిసారించాల్సి అవసరం ఉందని డాక్టర్‌ లాల్‌ సూచిస్తున్నారు. ఇందులో భాగంగా వారు ప్రత్యామ్నాయ పంటలవైపు వెళ్లినప్పుడు,లేదంటే పరిశ్రమలు, సేవారంగాలలో వారు ఉపాధి పొందేలా వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డాక్టర్‌ లాల్‌ సూచించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి