జనవిజయంఆంధ్రప్రదేశ్ఏ.పీలో వాయిదా పడ్డ పదోతరగతి పరీక్షలు

ఏ.పీలో వాయిదా పడ్డ పదోతరగతి పరీక్షలు

  • ఏపిలో టెన్ పరీక్షలు వాయిదా
  • కరోనా కట్టడి తరవాత షెడ్యూల్ ప్రకటిస్తాం
  • విద్యార్థులు నష్టపోరాదన్నదే ఉద్దేశ్యం :మంత్రి సురేశ్

అమరావతి,మే27(జనవిజయం): విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ 10 వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని… త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్ పరీక్షలు చాలా అవసరమని తెలిపారు. విద్యార్థులు నష్ట పోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీ బీఎన్ ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. నీ బీఎన్ ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని.. తల్లిదండ్రులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు.స్వీయ నియంత్రణతో కరోనా నుండి కాపాడుకో వచ్చన్నారు. ఉపాధ్యాయులు కూడా కరోనాకు ప్రాణాలు కోల్పోయారన్నారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. టీడీపీ మొండి వైఖరితో ముందుకు వెళుతుందని విమర్శించారు. వాస్తవాలను వాస్తవంగా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. లోకేష్ ఏమి సాధించాలని పరీక్షలు రద్దు చేయాలని అంటున్నారని ప్రశ్నించారు. పరీక్షలు రాయకపోతే ఏమైనా కరోనా రాదు అని గ్యారెంటీ ఉందా అని మంత్రి సురేష్ నిలదీశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి