జనవిజయంతెలంగాణశ్రీశ్రీ అక్షరం ప్రపంచానికి వెలుగు

శ్రీశ్రీ అక్షరం ప్రపంచానికి వెలుగు

  • శ్రీశ్రీ వర్థంతి సభలో పాల్గొన్న సుద్దాల,లెనిన్, మువ్వా

ఖమ్మం,జూన్15(జనవిజయం): ఆకాశం బద్దలైనట్లు,భూమి కంపించినట్లు ఉబికి వస్తున్న అగ్నిపర్వతం లోని లావాలా ప్రళయ గర్జన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఒక మహోజ్వల చరిత్రను సృష్టించినవాడు శ్రీ శ్రీ అని ఆయనను చిన్నతనంలో తమ ఊరి రైలు స్టేషన్ లో కలిసానని ఆయన చేతి స్పర్శ తనకు ఇంకా నిత్య నూతనమై చైతన్య పరుస్తూ ఉంటుందని జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూమ్ వేదికగా జరిగిన శ్రీశ్రీ వర్థంతి సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆ మహాకవి స్ఫూర్తితో తాను రాసిన ఠాగూర్ చిత్రంలోని “నేను సైతం ప్రపంచాగ్నికి పాట” తన జీవితంలో గొప్ప మైలురాయి గా నిలబడిపోతుందని హర్షం వ్యక్తం చేసారు…ఆ మహాకవి ఉనికి కార్మిక కర్షక లోకం శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించినంత కాలం ఉంటుందని పేర్కొన్నారు… తాను సినీ రంగంలో అడుగుపెట్టి తన సినిమా ద్వారా యువతకు ఏదైనా ఒక సందేశం ఇవ్వటానికి చేసే ప్రయత్నం వెనుక ఖచ్చితంగా శ్రీశ్రీ కవిత్వపు ప్రభావం ఉందని స్పష్టం చేశారు… మహాప్రస్థానం,మరో ప్రపంచం,  భిక్షువర్షీయసి, మానవుడా వంటి కవితా ఖండికలు మనస్సును నిరంతరం ప్రశ్నించే శతఘ్నులని తనను ఎప్పటికీ కుదురుగా ఉండనివ్వని బడబాగ్నులన్నారు…యువశక్తిని అమితంగా ప్రేరేపించిన కవులలో శ్రీశ్రీ అగ్రగణ్యుడని ప్రశంసించారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ శ్రామిక లోకపు ఆత్మ శ్రీశ్రీ అని ఆయన వేసిన బాట తదనంతర తెలుగు సాహిత్య పరిణామాలను సమూలంగా మార్చివేసిందని ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఆ మహనీయునిని సజీవంగా నిలుపుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రత్యేక అతిథులుగా అరుణోదయ నాగన్న, ప్రజానాట్యమండలి వెంకటేశ్వర్లు,గోరటి రమేష్ తమ అభ్యుదయ గేయాలు తో శ్రీశ్రీని ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కవితా ఖండికలను తెలుగు రాష్ట్రాలలో లబ్ధప్రతిష్టులైన గాయకులు శేషగిరి,కన్నెగంటి,రౌతురవి,సదానంద్,యోచన,వీరభద్రం,జిగీష తదితరులు అద్భుతంగా ఆలపించి శ్రోతలను అలరించారు. జాషువా సాహిత్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు, రచయిత పగిడిపల్లి వెంకటేశ్వర్లు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయులైన సాహితీ దిగ్గజాల కార్యక్రమాలను నిర్వహించటం తమకు మహదానందమన్నారు. ఈ కార్యక్రమంలో కవులు అట్లూరి వెంకటరమణ, ఆనందాచారి, సీతారాం, సునంద, నామా పురుషోత్తం, దాసోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి