జనవిజయంవీడియోలుపల్లెటూరి అనుబంధాల ఎత్తిపొడుపు మాటలే పాటగా మారితే..

పల్లెటూరి అనుబంధాల ఎత్తిపొడుపు మాటలే పాటగా మారితే..

1984లో విడుదలైన మంగమ్మగారి మనువడు సినిమాలో భానుమతి రామకృష్ణ, వాణీజయరాం లు కలసి పాడగా భానుమతి రామకృష్ణ, సుహాసిని నటించిన ఈ పాట పల్లెటూరి అనుబంధాలను చూపుతుంది. అమ్మమ్మ, మనువరాళ్ళ సరదా ఎత్తిపొడుపు మాటలే పాటగా మలచిన ఈ గీతాన్ని డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు రచించారు. సంగీతం కె.వి.మహదేవన్, భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలకృష్ణ హీరోగా నటించారు. షాలిమార్ సినిమా యూట్యూబ్ చానల్ వారు ఈ పాటను అందిస్తున్నారు.

శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటమూ చూసిపో చుసిపో
శ్రీ సూర్యనారాయణా మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటమూ చూసిపో చుసిపో

తెల్లావారకముందే ఇల్లంతా పరుగుల్లు ఆ
చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో ఓ ఓ ఓ
ఎంత విడ్డూరమో హు ఇంకెంత విడ్డూరమో

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో
చిట్టిమనవడి రాక చెవిలోన పడగానే
ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో ఓ ఓ ఓ
ఎంత సంబరమో ఎంత సంబరమో

సరిగంచు పైట సవరించుకున్నా
మరీ మరీ జారుతుంది
ఓసోసి మనవరాల ఏం జరిగింది
ఓసోసి మనవరాల ఏం జరిగింది

తాతయ్యని నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగింది అమ్మమ్మ

అమ్మదొంగా రంగ రంగ
అమ్మదొంగా రంగ రంగ

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటమూ చూసిపో చూసిపో

కోడిని కొడితే సూర్యుణ్ణి లేపితే తెల్లరిపోతుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ వస్తుందా

దిగివచ్చి బావను క్షణమైన ఆపితే దేవున్ని నిలదీయనా
ఓయమ్మో కాలాన్ని తిప్పేయనా
నా పిచ్చితల్లి ఓ బుజ్జిమల్లి నీ మనసే బంగారం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
నూరేళ్ళు నిలవాలి ఈ మురిపం
అమ్మమ్మ మాట ముత్యాల మూట
ఆ విలువ నేనెరుగనా ఏనాడు అది నాకు తొలిదీవెన

శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా చిలకమ్మ బులపాటము చూసిపో చుసిపో
శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో
మా అమ్మమ్మ ఆరాటము చూసిపో చూసిపో

జనవిజయంలోని అన్ని తెలుగు హిట్ సాంగ్స్ కోసం ఇక్కడ నొక్కండి.

మీకు తెలిసిన తెలుగు హిట్ సాంగ్స్ కోసం మాకు వ్రాయండి : [email protected]

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి