వరద సహాయక చర్యల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారి గా ఐటిడిఎ పివో నియామకం
- కలెక్టర్ ప్రియాంక అలా
భద్రాచలం, జూలై 23 (జనవిజయం):
గోదావరి వరద ప్రభావిత పరివాహక మండలాల్లో వరద సహాయక చర్యలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలు పర్యవేక్షణకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. అలాగే ముంపు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మరియు పినపాక మండలాల్లో వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్ అధికారులను, మండల ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. విధులు కేటాయించిన సెక్టోరియల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సెక్టోరియల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల అధికారులను సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని చెప్పారు. వరదలు, నిరంతరాయ వర్షాలు వల్ల దెబ్బ తిన్న ఇళ్లు, పంటలు, పశువుల గణన చేపట్టాలని చెప్పారు.