జనవిజయంతెలంగాణసోనూసూద్‌ను మన నటులు ఆదర్శరంగా తీసుకోవాలి- కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ భట్టి విక్రమార్క

సోనూసూద్‌ను మన నటులు ఆదర్శరంగా తీసుకోవాలి- కాంగ్రెస్ ఎం.ఎల్.ఏ భట్టి విక్రమార్క

  • ఆయనలా కరోనా కట్టడికి కలసికట్టుగా నిలబడాలి
  • ప్రభుత్వం మొద్దు నిద్రవీడి ప్రైవేట్‌ దోపిడీని అడ్డుకోవాలి
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పిలుపు

హైదరాబాద్‌,మే18(జనవిజయం): నటుడు సోనూసూద్‌ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చి కరోనా బాధితులకు అండగా నిలవాని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒక్కడు చేయగా లేనిది ఇక్కడ ఇంతమంది ఉండికూడా ఎందుకు ముందుకు రావడం లేదన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. పాతాళ భైరవి సినిమాలోలాగా అప్పుడప్పడూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకువస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేటీఆర్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా వచ్చాక కరోనా వ్యాక్సిన్‌ రాష్ట్రంలో పూర్తిగా బంద్‌ అయ్యిందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన జూమ్‌ సమావేశంలో విూడియాతో మాట్లాడుతూ, కార్పొరేట్‌, ప్రైవేట్‌ ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి వసూలు చేస్తున్న భరించలేని ఫీజులను నియంత్రించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేయాలని గత బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఏడాది సమయం ఉన్నా రాష్ట్రంలో కనీసం ఆక్సిజన్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఎక్కడ ఉందో, ఏ ఆసుపత్రిని పరిశీలించిందో? ఎక్కడ ఫీజుల నియంత్రణ చేసిందో ఇప్పటి వరకూ తెలియలేదన్నారు. కరోనా పెరుగుతున్న సమమంలో చీఫ్‌ సెక్రెటరీతో ఫోన్‌ చేసి మాట్లాడాను.. రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతోంది. దున్నపోతువిూద వానలా కదిలే పరిస్థితి లేదు. ఫామ్‌ హౌస్‌లో నిద్రిస్తోంది. మంత్రులెవరూ స్పందించడం లేదు. కనీసం బ్యూరోక్రసీతో పనిచేయించడం నీ బాధ్యత అని సీఎస్‌తో చెప్పి 15 రోజులైనా ఆయన స్పందించింది లేదని అంటూ భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాపై పూర్తిస్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలి కానీ.. గెస్ట్‌ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి ప్రశ్నించారు. ఇక వ్యాక్సినేషన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదన్నారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్‌ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్‌ ఎంత? అనే దానిపై ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని భట్టి అన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి