ఆదివాసీ నాయకుడు సోందె వీరయ్యను పరామర్శించిన ఎమ్.ఎల్.ఏ పొదెం వీరయ్య మరియు బి.ఆర్.ఎస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
హైదరాబాద్, 27 ఆగస్ట్(జనవిజయం) : తీవ్ర అనారోగ్యానికి గురైన ఆదివాసీ నాయకుడు మరియు గోండ్వానా సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోందె వీరయ్యను భద్రాచలం వైద్యులు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.విషయాన్ని తెలుసుకున్న భద్రాచలం ఎం.ఎల్. ఏ పోదెం వీరయ్య మరియు బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు లు నిమ్స్ కి చేరుకొని సోందె వీరయ్యను పరామర్శించారు. అంతేకాదు సంబంధిత వైద్యులతో సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఆర్థిక సహాయాన్ని అందించిన బొర్రా తిరుపయ్య
బొర్రా తిరుపయ్య స్టేట్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, సొందే వీరయ్య ని పరామర్శించి, వైద్య అధికారుల తో సంప్రదించి.. ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.