Tuesday, October 3, 2023
Homeవార్తలుజర్నలిస్టు నేత మామిడి సోమయ్యకు ఆత్మీయ అభినందన సత్కారం

జర్నలిస్టు నేత మామిడి సోమయ్యకు ఆత్మీయ అభినందన సత్కారం

హైదరాబాద్, ఆగస్టు08 (జనవిజయం): అమెరికా,  న్యూజిలాండ్ దేశాల పర్యటన ముగించుకుని క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చిన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏవీఎన్ న్యూస్ ఛానెల్ సీఈఓ, మహానది పత్రిక ఎడిటర్ మామిడి సోమయ్య ను పలువురు జర్నలిస్టులు, ఆత్మీయ మిత్రులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. మంగళవారం హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టులు, ఆత్మీయ మిత్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సోమయ్య కు ఆత్మీయ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్, సీనియర్ పాత్రికేయులు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, పిల్లి రాంచందర్, ఎల్గొయి ప్రభాకర్, సీనియర్ పాత్రికేయులు కొండయ్య, ఆకుల అమరయ్య, కె. మంంజరి, ప్రియా చౌదరి, ఫెడరేషన్ కోశాధికారి ఆర్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని సోమయ్య కు అభినందనలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు జె. ఉదయ్ భాస్కర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విజయానందరావు, ఎర్రమిల్లి రామారావు, కె. పాండురంగారావు, రాష్ట్ర వయోజన విద్యా వనరుల కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బండి సాయన్నలతో పాటు అనేక మంది జర్నలిస్టులు పూల బొకే, శాలువాలతో సోమయ్యకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య అమెరికా, న్యూజిలాండ్ దేశాల పర్యటన విశేషాలు, అనుభవాలను వివరించారు. ఆయా దేశాల్లో మీడియా రంగం- జర్నలిస్టుల స్థితి గతులు, విద్య,వైద్య విధానం, వ్యవసాయం తదితర అంశాలతోపాటు అక్కడి అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాలు, వ్యాపార వాణిజ్య రంగాల పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ…అమెరికా వంటి విదేశాలకు చాలా మంది వెళ్లి వస్తుంటారని, కానీ సోమయ్య లాగా అక్కడి విషయాలపై అధ్యయనం చేసి పదిమంది తెలిసేలా, ఉపయోగపడే విధంగా సమాచారం తెలియజేయరని అన్నారు. అమెరికా, న్యూజిలాండ్ దేశాల గురించి విశ్లేషించి అనేక విషయాలను వెల్లడించిన సోమయ్య ను అభినందించాలని అన్నారు. ఆయా దేశాల్లో అధ్యయనం చేసిన అంశాలను చిన్న పుస్తక రూపంలో తీసుకొస్తే అందరికీ ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అంతకుముందు రెండు రోజుల క్రితం చనిపోయిన ప్రజాగాయకుడు గద్దర్, నిన్న చనిపోయిన సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ల మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఎం ఏ రవూఫ్, జగదీశ్వర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర త్రిమూర్తి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments