కారేపల్లి, జూలై30 (జన విజయం): ఎర్రబొడుకు సమీపంలోని విద్యుత్ సౌకర్యం లేని ఆదివాసి వలస గుత్తికోయ గూడెం అయిన ఉటవాగులోని 26 కుటుంబాలకు సోలార్ దీపాలను కారేపల్లి ఎస్ ఐ పుష్పాల రామారావు అందించారు. గివ్(ఎన్జిఓ) స్వచ్చంద సంస్థ అధ్వర్యములో ఆదివారం వూటవాగు గ్రామములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో సంస్థ సభ్యులు మాట్లడుతూ ఇక్కడి ఆదివాసి గూడెములోని గిరిజనులు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో ఉంటుండగా నెల రోజులు క్రితం సింగరేణి సంస్థ సహకారముతో స్థానిక ఎస్ ఐ మూడు సొలార్ వీధి దీపాలు ఏర్పటు చేయించగా అక్కడ ప్రతి గుడిసెకు సొలార్ విద్యుత్ దీపాలు అందించాలని ఎస్సై మాకు విఙ్ఞప్తి చెయడముతో గివ్ సంస్థ ప్రతినిథి సత్య రాపెల్లి(యుఎస్ఏ) దృష్టికి తీసుకువెళ్లి దాదాపు 50 వేల వ్యయముతో 26 సొలార్ దీపాలు అందించామని తెలిపారు. కారెపల్లి ఎస్ ఐ పుష్పాల రామారావు మాట్లాడుతూ మారుముల ఆదివాసి గూడెంలో వెలుగులు నింపేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన గివ్ స్వచ్చంధ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఈసంస్థ అధ్వర్యములో ఉటవాగులో చిన్న పిల్లల కోసం బ్రిడ్జ్ స్కూలు ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం 26 కుటుంబాలకు మూడు బల్బులతో కూడిన సోలార్ దీపాల సెట్ అందించారు. ఈసందర్భంగా ఇంతటి మంచి మనసు సహాయం చేసే గుణం ఉన్న ఎస్సై రామారావుకి గూడెం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో గివ్ స్వచ్చంద సంస్థ సభ్యులు పి వి అరుణ్, రంగు శివ, పరశురామ్, గూడెం పెద్ద కుంజ సమ్మయ్య పాల్గొన్నారు .
