సోషల్ మీడియా పదునైన ఆయుధంగా మారింది
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా కేంద్రంగా ఎండగట్టాలి!
..సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..
జనవిజయం, 8 జులై( ఖమ్మం) : ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోషల్ మీడియా ని ఉపయోగించుకోవాలని, మతోన్మాద శక్తుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా కేంద్రంగా ఎండగట్టాలని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
శనివారం ఖమ్మం సుందరయ్య భవనం లో సోషల్ మీడియా పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్ నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలేరు నియోజకవర్గస్థాయి సోషల్ మీడియా సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.., నేటి సమాజంలో సోషల్ మీడియా పదునైన ఆయుధంగా తయారైందని అన్నారు. సమాచారాన్ని చేరవేయడంలో సోషల్ మీడియా అన్ని రంగాల్లోకన్న ముందంజలో ఉందన్నారు. సోషల్ మీడియాను మంచి పనులకు ఉపయోగించుకుంటే ఎంతో మంచి జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలువైన సమాచారాన్ని ప్రభుత్వానికి,అధికారులకు, ప్రజలకు చేరవేసి ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కరించబడ్డాయన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, వై విక్రం, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, పాలేరు సోషల్ మీడియా బాధ్యులు బోడపట్ల కార్తిక్, సోషల్ మీడియా మండల నాయకులు పొన్నం వెంకట్ రమణ,ఉమేష్, వెంకటేశ్వర్లు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.