జనవిజయంజాతీయంవాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ బ్యాన్ అవుతున్నాయా? ఈ వార్తల్లో నిజమెంత? అసలు నూతన ఐటీ రూల్స్...

వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ బ్యాన్ అవుతున్నాయా? ఈ వార్తల్లో నిజమెంత? అసలు నూతన ఐటీ రూల్స్ ఏం చెప్తున్నాయి?

గత రెండు రోజులుగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లు ఇండియాలో బ్యాన్ అవుతున్నాయనీ, ఇక మీదట ఈ ప్లాట్‌ఫాంలు ఇండియాలో పనిచేయవనీ రకరకాల వార్తలు అవే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం భారత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రవేశపెట్టిన నూతన ఐటీ రూల్స్. వీటి ప్రకారం 3 నెలలలోపు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలన్నీ ఈ రూల్స్ కు అనుగుణంగా నడుచుకోవాలి. నూతన ఐ.టీ రూల్స్ ఏం చెపుతున్నాయో తెలుసుకుంటే సోషల్ మీడియాలో ఈ అంశంపై వస్తున్న వార్తలలో నిజానిజాలను అవగతం చేసుకోవచ్చు.

2021 నూతన ఐటీ రూల్స్ (ముఖ్యంగా) ఏం చెప్తున్నాయి?

  • సోషల్ మీడియాలో సృష్టించిన మెసేజ్ లు వేర్వేరు వ్యక్తులు ఫార్వార్డ్ చేస్తూంటారు. ఈ మెసేజ్ లు / కంటెంట్ ను ఒరిజినల్ గా ఎవరు సృష్టించారో ఆ వ్యక్తిని గుర్తుపట్టాలి. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఈ విషయంలో సహకరించాలి.
  • డిజిటల్ మీడియా సైట్లు నడిపే పబ్లిషర్లందరూ ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకై 3 అంచెల విధానాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. ఇందుకుగానూ పబ్లిషర్లు ఫిర్యాదులను స్వీకరించేందుకై ఒక అధికారిని నియమించి, వచ్చిన ఫిర్యాదులపై 15 రోజులలోగా చర్యతీసుకోవాలి. ఈ అధికారిపైన సెల్ఫ్ రెగ్యులేషన్ బాడీని నియమించి, దానిని సమాచార మంత్రిత్వ శాఖతో రిజిస్టరు చేయించాలి. ఈ బాడీకి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్డు జడ్జి హెడ్ గా వుండాలి. ఇది పబ్లిషరు కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను పాటిస్తుందా లేదా అన్నది చేస్తూండాలి. 15 రోజులలోగా ఫిర్యాదుల అధికారి పరిష్కరించని ఫిర్యాదులను ఈ బాడీయే పరిష్కరిస్తుంది. ఈ బాడీను సమాచార మంత్రిత్వ శాఖ సూపర్వైజ్ చేస్తుంది.
  • సాధారణంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు (50 లక్షలకు పైగా యూజర్లున్నవి), సర్చ్ ఇంజన్లలో పుట్టుకొచ్చే కంటెంట్ వేర్వేరు వ్యక్తులకు చెంది వుంటుంది కనుక వాటిలోని అభ్యంతరరమైన, చట్టవ్యతిరేఖమైన కంటెంట్ కు ఈ ప్లాట్‌ఫాంలపై చర్యలు తీసుకోకుండా సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ ను కల్పిస్తారు. అయితే నూతన రూల్స్ ప్రకారం సరైన చర్యలు తీసుకోని ప్లాట్‌ఫాంలకు ఆ ప్రొటెక్షన్ అప్లై అవ్వదు.
  • ఐటీ ప్లాట్ఫాంలేవైనా సరే, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ఆఫీసర్‌ను నియమించుకుని, వచ్చిన ఫిర్యాదులను 24 గంటలలోగా ధృవీకరించి 15 రోజులలోగా పరిష్కారం చూపాలి.
  • అశ్లీల వీడియోలు, ఫోటోలు, మార్ఫ్ చేసిన కంటెంట్ లాంటివాటిపై వచ్చిన ఫిర్యాదులను 24 గంటలలోగా పరిష్కరించి సంబంధిత కంటెంట్ ను తొలగించాలి.
  • ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు నియమించిన అధికారులందరూ భారతీయులై వుండాలి. పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రతి నెలా ఒక రిపోర్టును ప్రభుత్వానికి నివేదించాలి.

నిజంగానే ఈ ప్లాట్‌ఫాంలు బ్యాన్ అవుతున్నాయా?

నూతన ఐటీ రూల్స్, 2021 ప్రకారం 3 నెలలలోపు ఈ నియమాలకు అనుగుణంగా తమ ప్లాట్‌ఫాంలను సిద్ధం చేసుకోవాలి. 3 నెలలు పూర్తవడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఈ రూల్స్ కు ఇంకా సంసిద్ధం అవ్వకపోవడంతో ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలైన ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటివన్నీ బ్యాన్ అవుతాయని పుకారు మొదలయింది. అయితే ఇది అవాస్తవం. నూతన ఐటీ రూల్స్ కు 3 నెలల లోపు సిద్ధంగా వుండాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ అది తప్పనిసరి కాదు. ఈ నియమాలకు అనుగుణంగా వ్యవహరించని ప్టాట్ఫాంలపై ఇదివరకటిలా సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్‘ / ‘లీగల్ ఇమ్యునిటీవుండదు. ఆయా ప్లాట్‌ఫాంలపై పుట్టుకొచ్చే కంటెంట్ కు బాధ్యతగా వాటిపైనే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ఎదుర్కోవాల్సుంటుంది.

భారత ప్రభుత్వంపై కోర్టుకు వెళ్ళిన వాట్సాప్:

తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద మెసెంజర్ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టులో నూతన ఐటీ రూల్స్ ను ఛాలెంజ్ చేస్తూ సూట్ ఫైల్ చేసింది. వాట్సాప్ ఎండ్ 2 ఎండ్ ఎన్క్రిప్షన్ ను ప్రొవైడ్ చేస్తూందని, ఒకవేళ నూతన ఐటీ రూల్స్ ను పాటించాల్సి వస్తే వాట్సాప్ లో వెళ్ళే ప్రతీ మెసేజ్ ను ట్రాక్ చేయాల్సి వుంటుందని, ఇది వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకరమని తెలిపింది. వ్యక్తులు వారు చేయని తప్పులకు కూడా బాధ్యులవ్వాల్సి వుంటుందనీ, కోట్ల మెసేజిలలో ప్రతి మెసేజ్ నూ ట్రాక్ చేస్తూ వుండడం సాధ్యపడదనీ తెలిపింది. ఒకవేళ ఈ పని చేయాల్సి వస్తే అది వ్యక్తిగత గోప్యతను, భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుందనీ తెలిపింది. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది.

ఇదిలా వుండగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్ నెట్వర్క్ ట్విట్టర్ కూడా నూతన ఐటీ రూల్స్ పై వ్యాఖ్యానించింది. బీజేపీ స్పోక్స్ పర్సన్ ట్వీటును మానిప్యులేటెడ్ మీడియాగాట్విట్టర్ వర్ణించిన తరువాత ట్విట్టర్ ఢిల్లీ ఆఫీసులో పోలీస్ రైడ్లు జరిగిన తరువాత ట్విట్టర్ సంస్థ తాజాగా నెలకొన్న పరిస్థితులు తమను కలచివేస్తున్నాయనీ, ఇవి మా సర్వీసులు ప్రొవైడ్ చేసే యూజర్ల భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకమనీ తెలిపింది. నాగరిక సమాజంలో ఈ రూల్స్ ను తప్పుగా వినియోగించే అవకాశమే ఎక్కువగా వుంటుందనీ, వ్యక్తులు బెదిరింపులకు గురయ్యే ప్రమాదముందనీ అభిప్రాయపడింది.

మొత్తానికి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ రూల్స్, 2021 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సోషల్ మీడియాలో పోస్టులను కట్టడిచేయడానికి ఈ చర్యలు తప్పవని ప్రభుత్వం వాదిస్తుంటే, మరోవైపు ఈ చర్యలు వ్యక్తిగోత గోప్యతను హరిస్తాయని, భావవ్యక్తీకరణకు, ఇండిపెంటెండ్ జర్నలిస్టులపై, చిన్నిచిన్న న్యూస్ వెబ్సైట్లపై తీవ్ర ప్రభావం చూపుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నూతన ఐటీ రూల్స్ పై దేశంలోని వివిధ కోర్టులలో పెటిషన్లు ఫైల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసులు విచారణ దశలో వున్నాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి