Saturday, February 24, 2024
Homeపల్లెప్రపంచంజీనియస్ప్రాత:స్మరనీయుడు థామస్‌ అల్వా ఎడిసన్‌

ప్రాత:స్మరనీయుడు థామస్‌ అల్వా ఎడిసన్‌

  • విద్యుత్‌ వెలుగులు విరజిమ్మచేసిన మహానుభావుడు

ఫిబ్రవరి12(జనవిజయం): ఆధునిక పరిజ్ఞాన ఆసరాతో, విద్యుత్‌ రంగంలో వచ్చిన అనూహ్యమైన మార్పులతో, మనిషి జీవన విధానం నేడు  విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్నది. అయితే దాదాపు 150 సంవత్సరాల క్రితం పరిస్థితిని విశ్లేషిస్తే, నాడు మనిషి సూర్యుని వెలుగు విూదనే ఆధారపడి తన జీవితాన్ని కొనసాగించేవాడు. సహజ వనరులతో కొవ్వత్తులు, బుడ్డి దీపాలు ఉన్ననూ అవి కేవలం సంపన్నుల వరప్రసాదాలుగా ఉండేవి. నేటి ఆధునిక జీవన విధానంలో సామాన్యునికి కూడా విశేష భోగ వసతులు అందుబాటులో ఉన్నాయి. అందుకు కారణం తమ మెదడులోని ఆలోచనలకు పదునుపెట్టి సరికొత్త విధానాలను, సాంకేతిక వసతులను, పరికరాలను కనుగొన్న ఎందరో శాస్త్రవేత్తలు. ఆ కోవలోనే పయనిస్తూ తన పరిశోధనల ద్వారా విద్యుత్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు అంకురార్పణ చేసి, నేడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల ఆధునిక పరిజ్ఞానానికి మూలపురుషుడు థామస్‌ ఆల్వా ఎడిసన్‌. నేడు ఆయన జయంతి.1847, ఫిబ్రవరి 11న అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో మిలాన్‌ అనే పట్టణంలో జన్మించారు. 1879 వ సంవత్సరం ఎడిసన్‌ కు తన జీవిత కాలంలో ఒక గొప్ప సంవత్సరం అని చెప్పాలి. ఆయనకే కాదు మనందరం నేడు విద్యుత్‌ దీపకాంతులతో పగలు రేయి అనే బేధం లేకుండా అన్ని పనులనూ చక్కగా చేసుకునేందుకు కారణం ఆ సంవత్సరమే.  విద్యుత్‌ శక్తిని ఉత్పత్తి చేసే విధానాలను కనుగొని నాటికి ఏభై సంవత్సరాలు అయినను విద్యుత్‌ ఉపయోగించి కాంతిని సృష్టించే పక్రియ మాత్రం అందని ద్రాక్షపండే అయింది. ఎడిసన్‌ ఆ దిశగా పరిశోధనలు జరిపి ప్లాటినం ఫిలమెంట్‌ ను ఉపయోగించి పనిచేసే లైట్‌ బుల్బ్‌ రూపొందించారు. అది నిజంగా శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మైలురాయి అని చెప్పవచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments