సిద్దిపేటలో ప్రజాస్వామ్యం అపహాస్యం – విజయశాంతి

0
135
  • ఆసుపత్రి సందర్శనకు వెళితే అరెస్టులా?
  • పోలీసుల తీరుపై మండిపడ్డ రాములమ్మ

సిద్దిపేట,మే22(జనవిజయం): సిద్దిపేటలో ప్రజాస్వామ్యం ఉందా? లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా? అని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులు పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా? అని ఆమె ఫైర్ అయ్యారు.

కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని హాస్పిటల్ లోకి వెళ్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా ? రోజు లాక్ డౌనను ఉల్లంఘిస్తున్న వాళ్లపై ఎంతమందిపై కేసులు పెట్టి కోర్టు ముందు ప్రవేశ పెట్టారని విజయశాంతి ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీష్ రావు చెప్పుకుంటున్న అభివృద్ధి అంత డొల్ల అని తేలిపోయిందని ఆమె అన్నారు. ఇక సిద్దిపేటలో డమ్మి అభివృద్ధి బుడగ త్వరలో పగలడం ఖాయమన్న ఆమె సిద్దిపేట హాస్పిటల్ లో కరోనా పేషెంట్లను పట్టించుకోవట్లేదని వాళ్ళ బంధువులు, టీఆర్ఎస్ నేతలే వీడియో మెసేజ్ లు పెట్టారని అన్నారు.

సిద్దిపేట సర్కార్ దవాఖానకు పోతే చచ్చినట్లే అని పేషేంట్ల బంధువులు చెబుతుంటే అక్కడి చిన్న దొరకు, ఫామ్ హౌజ్ పెద్ద దొరకు వినిపించడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. వాస్తవాలు చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లిన సిద్దిపేట జిల్లా బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు అరుణా రెడ్డి, ప్రధాన కార్య దర్శి పద్మ గౌడ్ పై కేసులు పెట్టిస్తారా? ఇది అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు. పీపీఈ కిట్ లేకుండా గాంధీ, ఎంజీఎం లో తిరిగిన సీఎం పై ఎం కేసు పెట్టాలని ఆమె ప్రశ్నించారు.  కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని డిమాండ్ చేసిన ఆమె ఆరోగ్యశ్రీ పరిమితి ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here