జనవిజయంజాతీయంకోవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌తో పోరాడాలి - ప్రధాని మోడీ

కోవిడ్‌తో పాటు బ్లాక్‌ ఫంగస్‌తో పోరాడాలి – ప్రధాని మోడీ

  • వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని
  • వారణాసి వైద్యులతో మోడీ వర్చువల్‌ సమావేశం
  • అనుకున్న వారిని కోల్పోవడంతో భావోద్వేగానికి గురైన మోడీ
  • కొత్తగా 2,59,591 కరోనా కేసుల నమోదు
  • దేశంలో మరో 4,209 మంది కరోనాతో మృతి

న్యూఢిల్లీ, మే21(జనవిజయం): కొవిడ్‌`19 సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన పార్లమెంట్‌ నియోజకవర్గం వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుధ్య కార్మికుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. కొవిడ్‌`19తో పాటు ప్రధాన సవాల్‌ గా ముందుకొచ్చిన బ్లాక్‌ ఫంగస్‌ నిరోధానికి ప్రజలు జాగ్రత్త వహించాలని ప్రధాని కోరారు. కరోనా మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని స్పష్టం చేశారు. కొవిడ్‌`19పై మనం పోరాడుతుండగానే బ్లాక్‌ ఫంగస్‌ రూపంలో మరో సవాల్‌ ఎదురైందని దీన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు మనం జాగ్రత్తలు పాటిస్తూ సంసిద్ధం కావాలని అన్నారు. కరోనా కట్టడిలో వారణాసి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సేవలను ప్రధాని ప్రశంసించారు. తక్కువ సమయంలోనే నగరంలో ఆక్సిజన్‌ పడకు, ఐసీయూ పడకను పెద్ద సంఖ్యలో విస్తరించారని కొనియాడారు. వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్‌ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాను కృషిని అభినందించారు. కోవిడ్‌ మహమ్మారికి ఎంతో మంది బయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్‌ బలి తీసుకుంది. వారి కుటుంబాకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికు ప్రాణాను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని మోదీ అన్నారు.

కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదు కాగా, 4,209 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 2 కోట్ల 60 లక్షల 31 వేలకు కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్‌ కేసులు ఉండగా, కరోనాతో 2,91,331 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని, భారతదేశంలో యాక్టివ్‌ కేసులు 11.63 శాతం, మరణాల రేటు 1.12 శాతం ఉన్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద చేసిన హెల్త్‌ బులిటెన్‌లో తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి