జనవిజయంతెలంగాణసామాజిక సేవా కార్యక్రమాలలో కమ్యూనిస్టులు ముందుండాలి

సామాజిక సేవా కార్యక్రమాలలో కమ్యూనిస్టులు ముందుండాలి

– సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ఖమ్మం, మే22(జనవిజయం) : సామాజిక సేవా కార్యక్రమాలలో కమ్యూనిస్టులు ముందుంటూ, కష్ట కాలాలలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.మే 21,22వ తేదీలలో 2 రోజుల పాటు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సిపిఎం ఆన్లైన్ రాజకీయ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సిపిఎం శ్రేణులు ప్రజా సేవా కార్యక్రమాలలో ముందున్నారని తెలిపారు. ఒకవైపు రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూనే మరోవైపు ప్రజలకు సేవ చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కోవిడ్ బారినపడిన ప్రజల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయాలను ఐసొలేషన్ సెంటర్లుగా మార్చామన్నారు. వందల మంది కోవిడ్ బాధితులకు, కార్యాలయాలలో నిరంతరం సేవ చేస్తున్నామన్నారు. అలాగే వేలాదిమందికి ఆహారం, నిత్యావసర సరుకులను అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా నిష్ణాతులైన డాక్టర్ల బృందాల చేత కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుండి పూర్తిస్థాయిలో సహకారం అందుతోందని తెలిపారు. ప్రభుత్వాలు కరోనాను నియంత్రించడంలో విఫలమవుతున్నామని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తూ, వైద్య సౌకర్యాలు కల్పిస్తూ, కరోనా సంక్షోభాన్ని నియంత్రించాలని కోరారు. ఈ రెండు రోజుల రాజకీయ తరగతులలో జాతీయ, అంతర్జాతీయ విషయాలు, ఆర్ధిక విధానాలు, ప్రజలపైన ప్రభావం, సిపిఎం పార్టీ విశిష్టత, నిర్మాణం అనే అంశాల పైన సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఎం.సాయిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్యలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, అకడమిక్ సెల్ కన్వీనర్ ఎ.జె.రమేష్, వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడి తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి