Thursday, March 28, 2024
Homeన్యాయంఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం, మార్చి 31 (జనవిజయం) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. సమావేశంలో అట్రాసిటీ కేసుల పురోగతి పై ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, కల్లూరు సబ్ డివిజన్ ల వారీగా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, మూఢ నమ్మకాలు, అట్రాసిటీలపై చర్చకు కమిటీ సమావేశం ఒక మంచి వేదిక అని అన్నారు. వచ్చే నెలలో బాబు జగ్జీవన్ రామ్, డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ ల జయంతి, డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణలు ఉన్నాయన్నారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా పకడ్బందీగా దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలను సేకరించి సకాలంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. సామాజిక బహిష్కరణలు విధిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున అందించాల్సిన ఆర్ధిక సహాయాన్ని సకాలంలో అందే విధంగా చూడాలన్నారు. పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు, తద్వారా సమస్యలు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కమిటీలోని అనధికార సభ్యులు కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, క్షేత్ర స్థాయిలో అట్రాసిటీ అంశాలతో ముడిపడి ఉన్న సంఘటనల గురించి ఎప్పటికప్పుడు తమ దృష్టికి తేవాలని అన్నారు. ప్రతీ నెల తప్పనిసరిగా గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించేలా చూడాలని, ఇట్టి కార్యక్రమానికి తహసీల్దార్, ఎస్హెచ్ఓలు హాజరవ్వాలని ఆయన అన్నారు. 2016 నుండి ఇప్పటి వరకు 618 మంది బాధితులకు రూ. 8,77,10,000 ల పరిహారం మంజూరు చేసినట్లు, ఇందులో 175 మంది ఎస్టీ, 443 మంది ఎస్సి బాధితులు ఉన్నట్లు ఆయన అన్నారు. పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పోలీస్ శాఖ తరపున బాధితులకు తప్పనిసరిగా పూర్తి న్యాయం జరిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఖమ్మం టౌన్ సబ్ డివిజన్ పరిధిలో 7, ఖమ్మం రూరల్ పరిధిలో 5, వైరా పరిధిలో 5, కల్లూరు సబ్ డివిజన్ పరిధిలో 6, మొత్తంగా 23 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఇందులో 4 కేసులు సాక్ష్యాల సేకరణలో, 4 కేసులు కుల ధ్రువీకరణ, భూ పత్రాలు, వైద్య ధ్రువీకరణల సేకరణలో, 1 కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు, 5 కేసులు పీఆర్ సి కొరకు పెండింగులో ఉన్నట్లు, 3 కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేసినట్లు, 2 కేసులు ఉన్నత స్థాయి అధికారులకు రెఫర్ చేసినట్లు తెలిపారు. కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. కమిటీ అనధికార సభ్యులు మాట్లాడుతూ, దళిత బంధు యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ కు అహర్నిశలు కృషి చేసిన కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. దళిత వాడల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను భర్తీ చేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాలు పట్టణంలో నిర్మించాలన్నారు. ఇనాం భూముల కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బాబు జగ్జీవన్ రాం, డా. బీఆర్. అంబెడ్కర్ ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, అదనపు డిసిపి ఎస్.సి. బోస్, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి కె. సత్యనారాయణ, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, ఏసీపీలు గణేష్, బస్వా రెడ్డి, రెహ్మాన్, రామానుజం, డీటీడబ్ల్యుఓ కృష్ణా నాయక్, అధికారులు, విజిలెన్సు అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జి. వీరబ్రహ్మయ్య, జే. దాస్ మహారాజ్, టి. అంజయ్య, కె. రాంబాబు, ఏ. శ్రీనివాస్, ఎం. వెంకట్, పి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments