జనవిజయంతెలంగాణకష్టకాలంలో సత్తా చాటుతున్న కమ్యూనిస్టులకు లాల్ సలామ్ - టీ.డబ్ల్యూ.జే.ఎఫ్ జిల్లా కార్యదర్శి పల్లా కొండల...

కష్టకాలంలో సత్తా చాటుతున్న కమ్యూనిస్టులకు లాల్ సలామ్ – టీ.డబ్ల్యూ.జే.ఎఫ్ జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు

బోనకల్, జూన్ 6 (జనవిజయం) : ప్రపంచ వ్యాపితంగా కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడంలో సత్తా చాటుతున్న కమ్యూనిస్టులకు లాల్ సలాం చెబుతున్నానని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి పల్లా కొండల రావు తెలిపారు. మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కోవిడ్ టెస్ట్ కోసం వచ్చిన వారికి, వేక్సినేషన్ కోసం వచ్చిన వారికి ప్రతిరోజు బోనకల్ లో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఐదవరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పల్లా కొండల రావు మాట్లాడుతూ అల్పాహారం ఏర్పాటుకు ఆర్దిక సహకారం అందించిన బొప్పాల సీతారామయ్య గారి కుమారుడు అజయ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. ఈరోజు సీతారామయ్య వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమంకు ఆర్ధిక సహకారం అందించడం మంచి సాంప్రదాయమన్నారు. ప్రజలు కష్టకాలంలో ఉన్న ఇలాంటి సందర్భాలలో మాత్రమే కాకుండా బర్త్ డే లు, పెళ్లిళ్లు, వివిధ ఫంక్షన్ ల పేరుతో ఖర్చు చేసే మొత్తాన్ని ఇటువంటి సేవా, స్పూర్తి దాయక కార్యక్రమాలకు వినియోగించడం మంచి సంప్రదాయం అవుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ను ఎదుర్కోవడంలో పెట్టుబడి దారీ వ్యవస్థలు విఫలం అవుతుంటే కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాలు, అధికారంలో లేని చోట ఆ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టి.డబ్ల్యూ.జే.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు తేనే వెంకటేశ్వర్లు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు కిలారు సురేష్, తెల్లాకుల శ్రీనివాసరావు, బోనకల్ మాజీ సర్పంచ్ బుక్యా జాలు, ఏసుపోగు బాబు, చొప్పకట్లపాలెం శాఖ కార్యదర్శి చలమల హరి కిషన్ రావు, చొప్పకట్లపాలెం మాజీ ఉప సర్పంచ్ బోయినపల్లి పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంమంతెన ఆరోగ్య సలహాలువీడియోలుజర్నలిజంవికాసంవినదగునెవ్వరు చెప్పినపర్యావరణంఎడిటర్ వాయిస్ఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంవార్త-వ్యాఖ్యనేర వార్తలువీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి