సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
…నవీన్, PDSU సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి..
జనవిజయం, 12 జూలై(ఖమ్మం): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు మరియు స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయకుండా పాఠ్యపుస్తకాలను,యూనిఫార్మ్స్, నోట్ బుక్స్ అందించా కుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి నెలలు గడుస్తున్నా ఆరకొర పుస్తకాలను అందించి చదువులను కొనసాగిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నేడు రాష్ట్రంలో కనిపిస్తుందిని, ఈ సమస్య ల పరిష్కారం కై రాష్ట్ర వ్యాపిత బంద్ లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం లో విద్య సంస్థల బంద్ విజవంతం అయిందని నవీన్, PDSU సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి ఓ ప్రకటన లో తెలిపారు.
ఉమెన్స్ కాలేజి నుండి బయలు దేరిన ర్యాలీలో పి. డి. యస్. యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ పాల్గోని మాట్లాడుతూ..కళాశాల విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు సుమారు 5300 కోట్ల రూపాయలు ఇప్పటివరకు విడుదల చేయకుండా విద్యార్థులను మరియు కళాశాల యజమాన్యాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి గురి చేస్తుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.రాష్టంలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పై ఆధారపడి పేద విద్యార్థులు ఉన్నత చదువును కొనసాగిస్తుంటే ఆ విద్యార్థులు చెల్లించాల్సిన రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లు గత మూడు సంవత్సరాల నుండి చెల్లించకుండా కేజీ టూ పీజీ ఉచిత విద్యాంటూ ఇబ్బందులకు గురించేయడమేనా కెసిఆర్ అభివృద్ధి పాలనా అని వారు ప్రశ్నించారు. ఫీజుల నియంత్రణ చట్టం అములుచేయకుండా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ విద్యార్థులను మరియు విద్యార్థి తల్లిదండ్రులను అనేక రకాలుగా ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమం లో యస్. యఫ్.ఐ నాయకులు నాగ కృష్ణ, పి. డి. యస్. యూ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి నవీన్, పి. డి. యస్. యూ సత్తుపల్లి నగర కార్యదర్శి రమ్య, నాయకులు రాజేశ్వరి, అంజలి, పరమేష్, కావ్య, జాన్సీ, హాహాలాయ్య తదితరులు పాల్గొన్నారు..