ఖమ్మం, జూలై 29 (జనవిజయం): మున్నేరు వరదల్లో మృతి చెందిన పెండ్ర సతీష్ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియాను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డితో కలిసి శనివారం జలగం నగర్ లోని పెండ్ర సతీష్ ఇంటి వద్ద అందజేశారు. ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియ కు సంబంధించి రూ. 4 లక్షల చెక్కును వారు పెండ్ర సతీష్ భార్య కూడెల్లి శ్రుతి కి అందజేశారు. ఈ సందర్భంగా పెండ్ర సతీష్ మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్.పి. సి.ఇ.ఓ. వి వి అప్పారావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ సుమ, ఎం.పి.డి.ఓ. అశోక్, ఎ సి పి బస్వా రెడ్డి, ఎం పి పి బెల్లం ఉమా, జడ్ పి టి సి వరప్రసాద్, బెల్లం వేణు,రెడ్యా నాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.