Tuesday, October 3, 2023
Homeవార్తలుమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ వై ఆర్‌ కే  సతీమణి సరళా దేవికి సీపీఎం ఘన...

మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ వై ఆర్‌ కే  సతీమణి సరళా దేవికి సీపీఎం ఘన నివాళులు

నివాళులు అర్పించిన తమ్మినేని, పువ్వాడ నాగేశ్వరరావు, పోతినేని సుదర్శన్‌
ఖమ్మం, ఆగస్ట్‌ 10 (జనవిజయం) :  ఈ రోజు తెల్లవారుజామున 1.15 నిమిషాలకు మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ యలమంచిలి రాధాకృష్ణమూర్తి సతీమణి శ్రీమతి సరళాదేవి (94) తుది శ్వాస విడిచారు. ఖమ్మం నగరంలోని జహీర్‌పురలో గల వారి స్వగృహంలో ఆమె భౌతికాయాన్ని సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వం సందర్శించి ఘనంగా నివాళలర్పించడం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సరళాదేవి భౌతికాయంపై సిపిఎం పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు.
యలమంచిలి  సరళాదేవికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులు
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రయం యలమంచిలి సరళాదేవి పార్థివ దేహానికి ఖమ్మం కాలువ ఒడ్డులోని వైకుంఠ ధామం వద్ద పూలమాలవేసి ఘన నివాళులర్పించి, ఆమె కుమారులైన డాక్టర్‌ రవీంద్రనాథ్‌, రామకోటేశ్వర్‌రావులకు సానుభూతి తెలియజేశారు. డాక్టర్‌ వై ఆర్‌ కే కుటుంబం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, వై ఆర్‌ కె అనేక ఉద్యమ పోరాటాలలో తిరుగుతున్న సమయంలో సరళాదేవి ఎంతో సహకరించేదని,  రాధాకృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించినప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదని, వారి కుటుంబం పార్టీకి ఎంతో అండదండగా కొనసాగిందని ఈ సందర్భంగా తమ్మినేని అన్నారు. సరళ దేవికి విప్లవ జోహార్లు అర్పించారు.
భౌతిక దేహానికి నివాళులు అర్పించిన వారిలో సిపిఎం రాష్ట్ర నాయకులు  పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్‌, వై.విక్రమ్‌, బుగ్గవీటి సరళ, భూక్య వీరభద్రం, మాదినేని రమేష్‌, ఎర్ర శ్రీనివాసరావు, ఎం సుబ్బారావు, బండారు రమేష్‌, ఆర్‌ప్రకాష్‌, మాచర్ల భారతి, బండి పద్మ, బాగం అజిత, అఫ్రోజ్‌ సమీనా, వజినేపల్లి కనకలక్ష్మి, షేక్‌ బషీరుద్దీన్‌, బండారు యాకయ్య, భూక్య శ్రీనివాసరావు, ఎం.ఏ. జబ్బార్‌, ఎస్‌.కె. మీరా, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎర్ర గోపి, ఎల్లంపల్లి వెంకట్రావు, మాచర్ల గోపాల్‌, ఎస్‌.కె.సైదులు, బండారు వీరబాబు, ఎస్‌.కె. హిమామ్‌, ఎస్‌.కె.బాబు, వేల్పుల నాగేశ్వరరావు, పాశం సత్యనారాయణ, ఎర్ర మల్లిఖార్జున్‌, పగడాల మోహన్‌రావు, పోతురాజు జార్జి, గబ్బెటి పుల్లయ్య, గణపనేని బడేమియా చౌదరి, గడపనేని పున్నయ్య, సోమనబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నివాళులు అర్పించిన ప్రముఖులు:
సరళాదేవికి నివాళలు అర్పించిన వారిలో సిపిఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, ఎం.ఎల్‌. CPIML ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు,జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు , ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ ఎం.డి.ఖమర్‌, నగరంలోని ప్రముఖ డాక్టర్లు, వ్యాపారవేత్తలు వున్నారు.

సరళ దేవికి నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రజా వైద్యులు డా.యలమంచిలి రాధాకృష్ణమూర్తి సతీమణి శ్రీమతి సరళాదేవి గారు మృతి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. గురువారం నగరంలోని వారి నివాసంలో ఉంచిన ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళుర్పించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments