Thursday, October 5, 2023
Homeవార్తలుస్వల్పంగా శాంతించిన ఖమ్మం మున్నేరు

స్వల్పంగా శాంతించిన ఖమ్మం మున్నేరు

స్వల్పంగా శాంతించిన ఖమ్మం మున్నేరు

  • ప్రజా రవాణాను పునరుద్ధరించడానికి ఎర్పాటు చేయండి
  • వంతెనల వద్ద ప్రజలను అనుమతించాలి
  • అధికారులు విశ్రమించొద్దు.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, జులై 28 (జనవిజయం) :

మున్నేరు వరద ఉదృతి ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి 12.30 నిమిషాల వరకు NDRF బృందంతో కలిసి ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు . శుక్రవారం ఉదయం కాల్వొడ్డు వద్ద మంత్రి పువ్వాడ మున్నేరు పరిస్థితులను పరిశీలించి పరిస్థితులను వాకోబు చేశారు. ప్రజా రవాణా ను ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా చూడాలని, ప్రమాద స్థాయికి ఉన్న ప్రాంతాల్లో తప్ప క్షేమకరం దారులన్నీ పునరుద్ధరించాలని ఎసిపి బోస్ ను ఆదేశించారు.

వాహనాల రాకపోకలు మూసివేసిన ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై రవాణా అనుమతించాలని చెప్పారు. మున్నేరు ప్రస్తుతం 21.10 అడుగులు ఉందని ACP బోస్ మంత్రికి వివరించారు. 19 అడుగులకు చేరిన అనంతరం కాల్వొడ్డు మున్నేరు పై వాహనాలు అనుమతించాలని సూచించారు. పూర్తి స్థాయిలో మున్నేరు తగ్గు ముఖం పట్టే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని, వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రభలకుండా అధికారులు అప్రమత్తతో బ్లీచింగ్ చల్లి, మురుగు తొలగించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అన్ని పీ.హెచ్.సీల పరిధిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా ఉండాలని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments