వైరా, ఆగష్టు 31 (జనవిజయం): మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మానసిక దివ్యంగా బాలికలతో రాఖీలు కట్టించి వారికి ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. అనంతరం అరటి పండ్లు, చాక్లెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ అన్నా-చెల్లెళ్ళు, అక్కా-తమ్ముళ్ళ అనుబంధాలకు, అనురాగాలకు, ఆప్యాయతలను ప్రతీక అయిన రాఖీ పండుగను మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ పండుగలను అనాధలు, దివ్యాంగుల మధ్య జరుపుకోవడం వలన వారు కూడా ఆనందంగా జీవిస్తారని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని వాటిని అధిగమించి సమాజానికి ఉపయోగపడే విధంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, సభ్యులు గుడిమెట్ల వెంకట రోషన్, సిలివేరు రామకృష్ణ, సిలివేరు హనుమంతు, శాంతి నిలయం నిర్వాహకులు సిస్టర్ ఆల్ ఫీ, సిస్టర్ బిజిలీ, మరియా, ప్రేమ, మేరి, రోసాలియా, కుమారి, విద్యార్థులు సోను, కావ్య, నాగమణి, మేఘన, అంబిక, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.