విద్యలో ప్రావీణ్యం సాన్సియాకే సాద్యం
- 15 ఏళ్ళకే ఐఐటి సీటు
పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చు : ఈతకోట సాన్సియా
ఖమ్మం, జులై 28 (జనవిజయం) : లక్ష్య సాధనలో వెనకడుగు వేయకుండా పట్టుదలతో చదివి 15 ఏండ్లకే ఐఐటి సాధించిన సాన్ సియాను పలువురు అభినందిస్తున్నారు. ఖమ్మం పట్టణ ఎస్పీ ఆఫీస్ రోడ్డుకు చెందిన ఈతకోట సాన్సియా చిన్నతనం నుండి క్రమశిక్షణతో మెలుగుతూ, చదువులో ముందుండేది. ‘ఐఐటి’ నే కలగా పెట్టుకొని పట్టుదలతో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
దేశంలో టాప్ 7వ ర్యాంకింగ్ లో వున్న ఐఐటి గౌహతిలో సీటు సాధించడం గర్వకారణమని పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. భావి తరాలకు ఆదర్శవంతంగా, వయసుతో సంబంధం లేకుండా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మన తెలుగు బిడ్డ సాన్సియాకు ఖమ్మం పట్టణంలో పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.