జనవిజయంజాతీయంసంకల్పంతో సాధించండి...

సంకల్పంతో సాధించండి…

సరికొత్త అవతారంలో ‘ఎగ్జామ్ వారియర్స్’

రీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని జయించడానికి మార్గాలను సూచిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో రాసిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకం తాజా సంచిక (అప్‌డేటెడ్‌ వెర్షన్‌) ఈ నెలలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ‘పెంగ్విన్‌ ర్యాండమ్‌ బుక్‌ హౌస్‌’ అధికారికంగా తెలిపింది. ఇందులో తరగతి లోపల, వెలుపల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలున్నట్లు ప్రచురణకర్తలు పేర్కొన్నారు. వీటితో పాటు సమయపాలన పాటించడం, సాంకేతికతను ఉపయోగించడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం వంటివాటికి తగిన మార్గదర్శకాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులకూ తగిన సూచనలు ఉన్నట్లు తెలిపారు.

నరేంద్ర మోదీ స్వయంగా రచించిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ యువతకు ప్రేరణనిచ్చే పుస్తకం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సరళమైన, సంభాషణాత్మక శైలిలో రచించిన ఈ పుస్తకంలో విద్యార్థుల కోసం ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయడానికి 25 మంత్రాలున్నాయి. ప్రతి మంత్రం తర్వాత ఆసక్తిదాయకమైన యాక్టివిటీలు కూడా కలిగి ఉన్నాయి. వీటిని పుస్తకంలో కాని, నరేంద్ర మోదీ యాప్‌ ‘ఎగ్జామ్‌ వారియర్స్‌ మాడ్యూల్‌’ ద్వారా కాని పూర్తి చేయవచ్చు. పుస్తకంలో విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాలను పెంపొందించే ఉపయోగకరమైన ఆసనాలు, ప్రాణాయామం కూడా ఉన్నాయి. ఈ పుస్తకం విద్యార్థులకు పరీక్షలలో సాఫల్యంతో పాటు జీవితంలో సాఫల్యానికి కూడా ఉపయోగపడుతుంది.

‘‘నేను అరుణాచల్‌ప్రదేశ్‌లోని రోయింగ్ ప్రాంతానికి చెందిన దాన్ని. పరీక్షల సమయంలో, చాలా మంది. నన్ను ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం చదివావా! అని అడిగారు. కానీ నేను ఆ పుస్తకం చదవలేదు అని చెప్పాను. ఆ తర్వాత పుస్తకం కొనుక్కుని, రెండుసార్లకు పైగా చదివాను. ఈ పుస్తకం చదివిన తర్వాత నా అనుభవం చాలా మెరుగైంది. పరీక్షలకు ముందు ఈ పుస్తకం చదువి ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఉపయోగకరంగా ఉండేది అనిపించింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన చాలా అంశాలు దీనిలో ఉన్నాయి. కానీ, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయుల కోసం పెద్దగా ఈ పుస్తకంలో ఏమీ లేదు. మీరు కొత్త ఎడిషన్ కోసం ఏమైనా ఆలోచిస్తే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం కూడా మరికొన్ని కొత్త అంశాలు చేర్చాల్సిందిగా కోరుతున్నాను.’’ అని అలీనా తాయాంగ్ పేర్కొన్నారు.

ఇలా తాయాంగ్ అన్న మాటలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? ‘‘నా యువ స్నేహితులు నాపై ఈ నమ్మకాన్ని ఉంచారు. వారు అడిగిన దాన్ని నెరవేర్చే బాధ్యత దేశ ప్రధాన్ సేవక్‌గా నాపై ఉంది. కచ్చితంగా నెరవేరుస్తాను. నా చిన్న స్నేహితురాలు నాకో చిన్న పని అప్పజెప్పింది. చెప్పాలంటే అవి నాకు ఆదేశాలు. ఈ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేందుకు నేను కట్టుబడి ఉంటాను.’’ అని. ‘WITH NEW MANTRAS FOR STUDENTS AND PARENTS’ ఈ విధంగా కొత్తగా తీసుకొచ్చిన ఎగ్జామ్ వారియర్స్ ఎడిషన్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల కోసం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను
చేర్చారు. ఇవన్నీ కలగలిపిన తాజా సంచిక త్వరలోనే విద్యార్ధుల ముందుకు రానుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి