పలు సేవా కార్యక్రమాలు
– బి.ఆర్.ఎస్.అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి
వేంసూరు,ఆగస్ట్,14(జనవిజయం): ఆగస్ట్ 15 న సత్తుపల్లి ఎమ్మెల్యే, జననేత సండ్ర వెంకటవీరయ్య జన్మదినం సందర్భంగా మండల పరిధిలోని వాడ వాడలా జననేత జన్మదిన వేడుకలను బి.ఆర్.ఎస్.పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని బి.ఆర్.ఎస్.మండల అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి చరవాణి ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ సర్కారు అని నియోజకవర్గ ప్రజల కోసం,రాష్ట్రoలోని శ్రామిక వర్గం కోసం నిరంతరం ఆలోచిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే దిశగా పయనిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తున్న సండ్ర వెంకటవీరయ్య కు ప్రజాదరణ వుంటుదని అన్నారు.సండ్ర జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని అనాధ శరణాలయం లోని అనాధలకు,వృద్దులకు పండ్లు పంపిణీ చేస్తామని,అందరు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.