ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించాలి
- ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం జులై 24(జనవిజయం) :
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్ డే’’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అర్జీదారులను నుండి దరఖాస్తును స్వీకరించి తదుపరి చర్య నిమిత్తం ఆయా శాఖల అధికారులకు బదలాయించారు.
ఖమ్మం రూరల్ మండలం యం.వెంకటాయపాలెంకు చెందిన కె.నాగేశ్వరరావు తనకు వచ్చే ఆసరా పింఛను ఆగిపోయినదని అట్టి పింఛన్‌ను పునరుద్దరించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి ఆదేశించారు. ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురం గ్రామంకు చెందిన పుప్పాల పద్మ తన కోడలు పేరు రేషన్ కార్డులో నమోదు చేసి రేషన్ ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామంకు చెందిన బుర్ర భద్రఖాళి తనకు తల్లంపాడు రెవెన్యూలో సర్వేనెం.172/అ3లో తనకు 0.23 కుంటల భూమి ధరణిలో పెండిరగ్‌లో వున్నట్లు చూపిస్తున్నందున అట్టి భూమిని తన పేరుమీద చేయించగలరని సమర్పంచిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం ఖమ్మం రూరల్ తహశీల్దారును ఆదేశించారు. కామేపల్లి మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఎస్‌కె.ఖాసీం గ్రామంలో మజీదు`ఎ`మన్వర్ కమిటీ అధ్యక్షునిగా తాను స్వంత ఖర్చలతో మజీదులో ఇంకుడుగుంట నిర్మించడం జరిగినదని అట్టి బిల్లును త్వరితగతిన ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించినారు. కారేపల్లి మండలం గాదెపాడు గ్రామంకు చెందిన షేక్ మహబూబ్ సాహెబ్ తనకు కోమట్లగూడెం రెవెన్యూలోని గాదెపాడు గ్రామ పంచాయితీ పరిధిలో సర్వేనెం.170, 169 నెంబర్‌లో య.1`15 కుంటల వ్యవసాయ భూమి కలదని, సర్వేనెం.173కు సంబంధించిన వ్యక్తి తమను మా భూమిపై విభేదిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, అట్టి భూమిని సర్వేచేసి మాకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా తహశీల్దారును ఆదేశించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంకు చెందిన డి.సురేష్ తనకు దళితబందు పథకంలో డి.జె యూనిట్ ఎంపిక చేసుకోవడం జరిగినదని అట్టి డి.జె.యూనిట్‌తో ఆర్ధికంగా ప్రయోజనం చేకూరిందని డి.జె సిస్టంకు 50 శాతం పోను మిగిలిన పైకంకు సంబంధించి రెండవ యూనిట్‌కు సంబంధించి ట్రాన్స్‌పోర్టు నిమిత్తం టాటా ఏ.సి ఎంపిక చేసుకోవడం జరిగిదని అట్టి యూనిట్‌ను త్వరితగతిన ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్త ఎస్సీకార్పోరేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. బోనకల్ మండలం, గ్రామంకు చెందిన బి.త్రివేని తాను ఎంఎస్సీ బి.ఈ.డి పూర్తి చేయడం జరిగిదని తాము చాలా పేదరికంకు చెందిన గిరిజన కుటుంబంకు చెందినానని, తనకు ఏదైన అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికనైన ఉద్యోగం కల్సించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా విద్యాశాఖాధికారికి తగు చర్య నిమిత్తం సూచించారు.
గ్రీవెన్స్ డేలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష్ అభినవ్, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శిరిష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.