పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె పోరాటం ఆగదు
- ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసఫ్ వెల్లడి
- 21వ రోజు బోనకల్ మండలం లోని గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు
బోనకల్ , జూలై 26(జనవిజయం):
తక్కువ జీతంతో రోజంతా పనిచేయించుకునే పెట్టి చాకిరి నుండి విముక్తి కలిగించేంతవరకు పోరాటం చేయవలసిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసఫ్ పిలుపునిచ్చారు.బోనకల్లు మండల కేంద్రంలో 21వ రోజు సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
అనంతరం బోనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 21 రోజు నుండి సమ్మె చేస్తున్న ఏ మాత్రం స్పందించకపోవడం అన్యాయమన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు అడుగుతున్న హక్కులు గొంతెమ్మ కోర్కెలు న్యాయమైన డిమాండ్ లేనన్నారు. గత ఆరు నెలలుగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై స్పందించాలని కోరుతూ ఎంపీఓ దగ్గర నుండి కమిషనర్ వరకు అన్ని స్థాయిలోని అధికారులకు వినతి పత్రాలు అందించిన తర్వాత ఆరు నెలలు గడిచిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేని సమ్మెకు దిగవలసి వచ్చిందని ఆయన తెలియజేశారు.
జీవో నెంబర్ 51ని వెంటనే సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 11 వ పిఆర్సి లో గ్రామపంచాయతీ కార్మికులను కూడా చేర్చి వారికి 11వ పిఆర్సి ప్రకారం బిల్ కలెక్టర్లకు కారోబార్లకు 19500, పారిశుద్ధ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 చెల్లించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ఈఎస్ఐ, పిఎఫ్ చట్టాలను అనువర్తింపజేయాలన్నారు.
గతం లో ప్రకటించిన విధంగా యాస్క్ డే ఇన్సూరెన్స్ స్కిం ను 10 లక్షల కు పెంచి అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ఇవ్వవలసిన వారంతపు,పండగ, జాతీయ,ఆర్జిత మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వమే కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పేరుతో గుర్తింపు కార్డులను మంజూరు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ విరమణ పొందిన కార్మికునికి చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలి లేనిపక్షంలో ఐదు లక్షల రూపాయల ఏక మొత్తంలో చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రతతో పాటు పనిచేస్తున్న పంచాయతీలోనే డబల్ బెడ్ రూమ్ పిల్లను మంజూరు చేయాలన్నారు. చట్టబద్ధంగా చేస్తున్న సమ్మెను విచ్ఛిన్నం చేయటానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏఐటీయూసీ నాయకులు,జేఏసీ రాష్ట్ర కన్వీనర్ బి వెంకటరాజం, ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, సీఐటీయూ మండల కన్వీనర్ బోయినపల్లి వీరబాబు, జేఏసీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పిట్టల మల్లయ్య, సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు,ఏఐటీయూసీ జిల్లా నాయకులు అనుముల నరేందర్ రెడ్డి, సిపిఐ మండల నాయకులు అకేనా పవన్, మండల జేఏసీ నాయకులు మరిదు పుల్లయ్య, ఆంతోటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.