పెంచిన ఔషధాలు, టోల్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలి
-సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం,మార్చి31(జనవిజయం): ఔషధాల (మందుల) ధరలు 12 శాతం, టోల్ గేట్ల వద్ద వసూలు చేసే చార్జీలు 5.5% పెంచటాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే వైద్యం పచ్చి వ్యాపారంగా మారి పేదలకు భారమై పోతుంటే, 12% మందులు ధరలు పెంచి పేదల జీవితాలతో చెలగాట మాడటం దారుణ మన్నారు. కరోనా నేపథ్యంలో ఔషధ కంపెనీలు చేసిన దోపిడీ చరిత్రలో కనీవినీ ఎరగని దని అన్నారు. జాతీయ రహదారుల పేరుతో సామాన్యుల, మధ్యతరగతి ప్రజలను దోచు కుంటున్న ప్రభుత్వం 5.5% పెంచి మరింత భారం వేయటం దుర్మార్గమైన చర్య అన్నారు. సామాన్యులపై భారాలు మోపి, సంపన్నులకు రాయితీ లు యిచ్చి,సంపద దోసి పెట్టే చర్యలు బిజెపి ప్రభుత్వం మానుకోవాలని, పెంచిన భారాలను, చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని నున్నా డిమాండ్ చేశారు.