ఖమ్మం ఆగస్టు 13 (జనవిజయం): సోషల్ మీడియా సామాన్యుడు చేతిలో ఆయుధమని దాన్ని సక్రమంగా ఉపయోగించి ప్రజల సమస్యల పరిష్కారానికి వాడాలని సోషల్ మీడియా జిల్లా నాయకులు వై విక్రమ్ అన్నారు.
స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్ అద్యక్షతన జరిగిన డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా సోషల్ మీడియా వర్క్ షాప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వై.విక్రమ్ మాట్లాడుతూ సోషల్ మీడియాని ఎట్లాంటి విలువలు, నిబంధనలో పాటించకుండా ఆర్ఎస్ఎస్, బిజెపి వాళ్ళు ఉపయోగించి ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని విమర్శించారు.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిజాలు చెప్పాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి సోషల్ మీడియాని ఉపయోగించాలని ఆయన అన్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కొంతమంది యజమానులు, పార్టీలకు తొత్తులుగా మారుతున్న సందర్భంలో సోషల్ మీడియా సామాన్యుడు ఆయుధం అన్నారు.
ఈ వర్క్ షాప్ లో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థి యువజన సమస్యల కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ కార్యకర్తలు సోషల్ మీడియా ఉపయోగించుకోవాలని, వస్తున్న అన్ని సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించాలని తెలియజేశారు.
డివైఎఫ్ఐ సోషల్ మీడియా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోషల్ మీడియా కన్వీనర్ గా వేల్పుల మధు, కొ కన్వీనర్లుగా గడ్డం విజయ్ , దిండు మంగపతి , యర్ర సాయిలతో పాటుగా ఉప్పల రమేష్, బత్తినేని రాంబాబు, విజయ్, ఉమేష్, మురళి ,లెనిన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సోషల్ మీడియా వర్క్ షాప్ లో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, సత్తెనపల్లి నరేష్, కూరపాటి శ్రీను, శీలం వీరబాబు, పటాన్ రోషిని ఖాన్, సుజాత, పదముత్తుఉష, రావులపాటి నాగరాజు, దాసరి మహేందర్, సుభాష్ రెడ్డి ,శ్యామ్, పొన్నం మురళి ,నాగూర్ పాషా, చిత్తారు మురళి ,జక్కంపూడి కృష్ణ, కనపర్తి గిరి, రెహమాన్, ఎర్ర నగేష్, మంగయ్య, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.