జనవిజయంతెలంగాణసాహిత్యంతో విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనలు

సాహిత్యంతో విద్యార్థుల్లో ఉన్నత ఆలోచనలు

  • ప్రముఖ రచయిత, బాల సాహితీవేత్త పురిమళ్ల సునంద, నాగినేని లీలా ప్రసాద్
  • ‘అక్షరాల తోవ’ ఆధ్వర్యంలో బాలవాక్కు కవిసమ్మేళనం

ఖమ్మం కల్చరల్, జూన్6 (జనవిజయం): సాహిత్యంతో విద్యార్థులు పెనవేసుకుంటే వారిలో ఉన్నతమైన ఆలోచనలు ఉద్భవిస్తాయని ప్రముఖ రచయిత, పాఠ్యపుస్తక రచయిత, బాలసాహితీవేత్త వరిమళ్ల సునంద పేర్కొన్నారు. అక్షరాలతోవ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ సాంఘిక సంక్షేమ గురుకులు బాలికల పాఠశాల విద్యార్థులతో ఆదివారం నిర్వహించిన బాలవాక్కు కవిసమ్మేళనం జూమ్ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా పరిమళ్ల సునంద మాట్లాడుతూ ప్రస్తుతం ఇంగ్లీష్ బాషమోజులో ఉన్న పిల్లలకు సాహిత్యం నేర్పడం వల్ల తెలుగు భాషపై మక్కువ పెరుగుతుందన్నారు. ఇందుకు మూడు వారాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్షరాల తోవ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుత సమయంలో విద్యార్థులు ఖాళీగా ఉంటే ఇతర ఆలోచనలు ఎక్కువవుతాయని, అదే కవిత్వంపై దృష్టి మరలిస్తే చక్కటి సాహిత్యకారులు అవుతారని అన్నారు. ప్రతి వారం చక్కటి అంశాలను ఎంచుకుని పిల్లలతో కవితలు రాయించడం అభినందనీయమన్నారు. తాను ఉపాధ్యాయురాలిగా పిల్లలతో చదివించడం, కవితలు, కథలు రాయించడం చేశానని పేర్కొన్నారు. అలాగే కొన్ని పుస్తకాలను ముద్రించినట్లు తెలిపారు. పిల్లలతో రాయించడమే గాకుండా పిల్లల కోసం తానూ రచనలు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు గొప్ప సాహిత్యకారులు కావాలని ఆకాంక్షించారు.

ప్రముఖ రచయిత, కవి, సాహిత్య ఆచార్య నాగినేని లీలాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాహిత్య సృజనకు ప్రోత్సహిస్తున్న అక్షరాల తోవ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మెదడులో సాహిత్యం చేరితే సమాజాన్ని ప్రేమించడంతో పాటు తాను ఎలా నడుచుకోవాలో తెలుస్తుందన్నారు. ఇది పిల్లలో నిబిడీకృతమైన కవితాస్సష్టిని ఇలా వెలికితీయడం అక్షరాల తోవకే చెల్లిందన్నారు. అందరూ పర్యావరణాన్ని రక్షించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇప్పుడు ఆక్సిజన్ డబ్బులతో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం తాను బాలసాహిత్యానికి చేసిన కృషిని వివరించారు. పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై విద్యార్థులు కవితలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో కాగజీనగర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సంగీత, బెల్లంపల్లి ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, సమన్వయ కర్తలు, తెలుగు ఉపాధ్యాయులు స్రవంతి, సౌజన్య, అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్లీ ఉపేందర్, ప్రముఖ రచయిత, బాలసాహితీవేత్త సయ్యద్ షఫీ, ప్రముఖ కవి సయ్యద్ జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి